రాయ‌ల‌సీమ లో వైసీపీకి ఎంపీ క్యాండెట్స్ లేరా..!

ఏపీలో విప‌క్ష వైసీపీ బ‌లంగా ఉన్న రాయ‌ల‌సీమ‌లో ఆ పార్టీ ప‌ట్టు కొద్ది కొద్దిగా స‌డులుతోందా ? ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేలు అధికార టీడీపీలోకి జంప్ చేయ‌డంతో ఆ పార్టీకి సంస్థాగ‌తంగా బ‌లాబ‌లాల సంగ‌తి ఎలా ఉన్నా ? కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్థులు, బ‌ల‌మైన ఎంపీ అభ్య‌ర్థుల కొర‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.గ‌త ఎన్నిక‌ల్లో సీమ‌లోని నాలుగు జిల్లాల్లో క‌డ‌ప జిల్లాలోని క‌డ‌ప‌, రాజంపేట‌, క‌ర్నూలులోని క‌ర్నూలు, నంద్యాల‌, చిత్తూరులోని తిరుప‌తి ఎంపీ స్థానాల‌ను వైసీపీ గెలుచుకుంది.

 Confusion In Ysrcp Over Rayalaseema Mp Candidates-TeluguStop.com

టీడీపీ అనంత‌పురం, హిందూపురం, తిరుప‌తి స్థానాలు గెలుచుకుంది.

ప్ర‌స్తుతం ఈ 8 ఎంపీ స్థానాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థులు ఎవ‌రు ఉంటారు ? అన్న‌దానిపై రాజ‌కీయ వ‌ర్గాలు సైతం అంచ‌నాకు రాలేక‌పోతున్నాయి.క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఎంపీ అయిన వెంట‌నే ఆమె భ‌ర్త చంద్ర‌బాబును క‌లిశారు.ఇక మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య‌ప్రకాశ్‌రెడ్డి వైసీపీలోకి వెళితే బుట్టా రేణుకకు టిక్కెట్ ద‌క్కుతుంద‌న్న‌ది డౌటే.

ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై.రెడ్డి గెలిచిన నాలుగు రోజుల‌కే టీడీపీలోకి వెళ్లి జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు బ‌దులుగా మ‌రో వ్య‌క్తికి జ‌గ‌న్ నంద్యాల ఎంపీ సీటు ఇవ్వాల‌నుకుంటున్నా అక్క‌డ బ‌ల‌మైన అభ్య‌ర్థి ఎవ్వ‌రూ క‌న‌ప‌డ‌డం లేదు.

ఇక చిత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సామాన్య ప్ర‌సాద్ ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉన్నారో అడ్ర‌స్ లేరు.

చిత్తూరు ఎంపీ సీటుకు సైతం జ‌గ‌న్ కొత్త క్యాండెట్‌ను వెతుక్కోవాలి.క‌డ‌ప ఎంపీగా ఉన్న జ‌గ‌న్ క‌జిన్ అవినాష్‌రెడ్డికి ఈ సారి సీటు ఇచ్చేందుకు జ‌గ‌న్ సుముఖంగా లేన‌ట్టు తెలుస్తోంది.

ఆయ‌న ప‌నితీరు స‌రిగా లేక‌పోవ‌డం, బ‌లం ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైఎస్‌.వివేక ఓడిపోవ‌డం లాంటి అంశాల‌పై జ‌గ‌న్ సురేష్‌రెడ్డిపై మండిప‌డిన‌ట్టు తెలుస్తోంది.

ఆ త‌ర్వాత సురేష్‌రెడ్డికి బాగా ప్ర‌యారిటీ తగ్గించేశారు.

ఇక వైసీపీ వీక్‌గా ఉన్న అనంత‌పురంలో హిందూపురం పార్ల‌మెంట‌రీ స్థానం ప‌రిధిలో వైసీపీ చాలా వీక్‌గా ఉంది.

ఇక్క‌డ టీడీపీ ఎంపీ నిమ్మ‌ల కిష్ట‌ప్పే చాలా వీక్‌.అయినా ఆయ‌న మీద‌కు ఓ మోస్త‌రు క్యాండెట్‌ను కూడా నిల‌బెట్ట‌లేని ప‌రిస్థితిలో వైసీపీ ఉంది.

ఇక అనంత‌పురం లోక్‌స‌భ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న అనంత వెంక‌ట్రామిరెడ్డి అక్క‌డ టీడీపీ ఎంపీ జేసీకి స‌రితూగ లేక‌పోతున్నారు.ఏదేమైనా జ‌గ‌న్ ఇప్ప‌టికైనా మేలుకుని సీమ‌లో కాన్‌సంట్రేష‌న్ చేయ‌క‌పోతే ఎంపీ సీట్ల‌లో ఇప్పుడున్న వాటిని కూడా నిలుపుకోవ‌డం క‌ష్ట‌మే.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube