కమెడియన్ పృథ్వీ షాక్ ఇచ్చిన కోర్టు .. నెలకి 8 లక్షలు భార్యకి చెల్లించాలి

ప్రముఖ సినీనటుడు పృథ్వీ పెళ్ళి గొడవలు గత ఏడాదికాలంగా వార్తల్లో ఉన్న సంగతి తెలిసిందే.పృథ్వీ భార్య శ్రీలక్ష్మీని అర్థాంతరంగా వదిలేసారని, ఇంట్లోంచి గెంటేసారని ఆయనపై అభియోగాలున్నాయి.

 Comedian Pruthviraj Ordered By Court To Pay 8 Lakhs Each Month To His Wife-TeluguStop.com

ఈ కేసుపై తీర్పు ఇచ్చిన విజయవాడ కోర్టు, ఈ కామెడియన్ కి ఊహించలేని షాక్ ఇచ్చింది.నెలకు ఏకంగా 8 లక్షలు తన భార్యకు చెల్లించాలంటూ తీర్పుని వెల్లడించింది.

వివరాల్లోకి వెళితే, కామెడియన్ పృథ్వీ 1984వ సంవత్సరంలో విజయవాడ జిల్లా అరండల్ పేటకు చెందిన శ్రీలక్ష్మీని వివాహమాడారు.పృథ్వీ అత్తవారికి ఓ మిఠాయి దుకాణం ఉండేది.

మామయ్య చనిపోయక ఆ దుకాణాన్ని పృథ్వీ, ఆయన సతీమణి ఇద్దరు కలిసి చూసుకున్నారు.అప్పుడే సినిమా అవకాశాలు కోసం వేట మొదలుపెట్టిన పృథ్వీ మెల్లిగా క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి, ఈరోజు లక్షల్లో ఛార్జీ చేసే స్టార్ కామెడియన్ గా ఎదిగారు.

2016 ఏప్రిల్ లో భార్యతో గొడవపడిన పృథ్వీ ఆమెని ఇంటినుంచి పంపించేసారట.భార్యభర్తల మధ్య గొడవలని చల్లార్చేందుకు బంధువులు, పెద్దమనుషులు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది.

చివరకు 2016 నవంబర్ లో శ్రీలక్ష్మీ పృథ్వీ మీద సెక్షన్ 498-A కింద కేసు వేసింది.తన జీవితాన్ని నడిపించుకోవడానికి పృథ్వీ నుంచి నెలకు 10 లక్షలు ఇప్పించాలని డిమాండ్ చేసింది.

ఇన్నాళ్ళు వాయిదా పడుతూ వచ్చిన తీర్పు, ఇప్పుడు బయటపడింది.పృథ్వీ నెలకు 8 లక్షలు, అంటే ఏడాదికి 96 లక్షలు శ్రీలక్ష్మీకి భరణంగా ఇవ్వాలంటూ తీర్పునిచ్చింది కోర్టు.

విచారణ సమయంలో పృథ్వీ కోర్టులో లేరు.షూటింగ్ పనిమీద అమెరికా వెళ్ళారు.

ఆయన బదులు కోర్టుకి హాజరైన కుమారుడు, తన తల్లిదండ్రులు ఇద్దరు అపార్థంతో విడిపోయారని, ఇందులో ఇద్దరు తప్పు లేదు, కొంతమంది బంధువులే తన తల్లికి మాయమాటలు చెప్పి ఇంత దూరం తీసుకొచ్చారని తన వాదన వినిపించినట్టు సమాచారం.మరి పృథ్వీ కోర్టు ననిర్ణయాన్ని ఒప్పుకుంటారో లేక దీన్ని ఛాలెంజ్ చేస్తూ పైకోర్టుకి వెళతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube