రామ్‌కి క‌మెడియ‌న్ పోటీ?

రామ్ ఇప్పుడు కెరీర్ ప‌ట్ల చాలా ఏకాగ్ర‌తగా ఉన్నారు.ఎప్ప‌టి నుంచో అనుకున్న హ‌రిక‌థ టైటిల్‌ని సైతం మార్చి నేటి ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకుని నేను-శైల‌జ అని టైటిల్ పెట్టిన‌ప్పుడే ఆ విష‌యం అంద‌రికీ మ‌రోసారి అర్థ‌మైంది.

 Comedian Dhanraj To Clash With Young Hero-TeluguStop.com

గ‌త కొంత‌కాలంగా రామ్ సినిమాలేవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రిగా ఆడ‌క‌పోవ‌డంతో ఆయ‌న మ‌రింత జాగ్ర‌త్త ప‌డుతున్నారు.శ్రీ స్ర‌వంతి మూవీస్ తెర‌కెక్కిస్తున్న నేను-శైల‌జ సినిమా దాదాపుగా పూర్త‌యింది.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.జ‌న‌వ‌రి 1న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

జ‌న‌వ‌రి 1న రామ్ సినిమాతో పాటు ధ‌న్ రాజ్ సినిమా కూడా విడుద‌ల కానుంది.ధ‌న్‌రాజ్ న‌టించిన `ప‌నిలేని పులిరాజు` సినిమాను జ‌న‌వ‌రి 1నే విడుద‌ల చేయ‌డానికి ఆ నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌.

సో జ‌న‌వ‌రి 1న గ‌నుక ప‌నిలేని పులిరాజు విడుద‌లైతే ఇప్ప‌టివ‌ర‌కు కొత్త ఏడాదికి విడుద‌ల‌య్యే సినిమాలు ఈ రెండే కావ‌డం గ‌మ‌నార్హం.సో ఇప్ప‌టివ‌ర‌కు కొత్త ఏడాదిలో రామ్‌కు పోటీగా ఉన్న ఏకైక వ్య‌క్తి ధ‌న్‌రాజే మ‌రి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube