రామ్ ఇప్పుడు కెరీర్ పట్ల చాలా ఏకాగ్రతగా ఉన్నారు.ఎప్పటి నుంచో అనుకున్న హరికథ టైటిల్‌ని సైతం మార్చి నేటి ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకుని నేను-శైలజ అని టైటిల్ పెట్టినప్పుడే ఆ విషయం అందరికీ మరోసారి అర్థమైంది.
గత కొంతకాలంగా రామ్ సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడకపోవడంతో ఆయన మరింత జాగ్రత్త పడుతున్నారు.శ్రీ స్రవంతి మూవీస్ తెరకెక్కిస్తున్న నేను-శైలజ సినిమా దాదాపుగా పూర్తయింది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.జనవరి 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
జనవరి 1న రామ్ సినిమాతో పాటు ధన్ రాజ్ సినిమా కూడా విడుదల కానుంది.ధన్‌రాజ్ నటించిన `పనిలేని పులిరాజు` సినిమాను జనవరి 1నే విడుదల చేయడానికి ఆ నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట.
సో జనవరి 1న గనుక పనిలేని పులిరాజు విడుదలైతే ఇప్పటివరకు కొత్త ఏడాదికి విడుదలయ్యే సినిమాలు ఈ రెండే కావడం గమనార్హం.సో ఇప్పటివరకు కొత్త ఏడాదిలో రామ్‌కు పోటీగా ఉన్న ఏకైక వ్యక్తి ధన్రాజే మరి.