టీ కాంగ్రెస్‌లో రెడ్డి వ‌ర్సెస్ బీసీ

తెలంగాణ కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఎలాంటి రోల్ ప్లే చేస్తుంద‌ని స‌గ‌డు వ్య‌క్తిని అడిగినా చెప్పేస్తాడు.క‌నీసం అక్క‌డ ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ పార్టీ పాస్ మార్కులు కూడా వేయించుకోలేక‌పోతోంది.

 Cold War Between Bc And Reddy Community In Telangana Congress-TeluguStop.com

టీ కాంగ్రెస్ గ్రూపు పాలిటిక్స్ లో మాత్రం అధికార పార్టీనే కాదు అన్ని పార్టీల్ని మించిపోయింది.ఇంకా ఎన్నికలకు చాలా సమయమున్నా.

ఇప్పట్నుంచే టికెట్లకు సంబంధించి రెండు ప్రధాన సామాజిక వర్గాలకు గొడవ మొదలైంది

టీ కాంగ్రెస్‌ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తుందా ? అన్న ప్ర‌శ్న పోల్‌గా పెడితే 1 శాతం కూడా ఓట్లు వ‌చ్చే ప‌రిస్థితి లేదు.కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీ కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఏకంగా ఆరేడుగురు ఎవ‌రికి వారు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

జానారెడ్డి, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి, డీకే.అరుణ‌, బీసీ కోటాలో దానం నాగేంద‌ర్ ఇలా ఈ లిస్టు పెద్ద‌దిగానే ఉంది

వాస్త‌వంగా చూస్తే టీ కాంగ్రెస్‌లో ప్ర‌స్తుతం రెడ్ల హ‌వానే న‌డుస్తోంది.

దీంతో ఇక్క‌డ ఇప్పుడు బీసీలు భ‌గ్గుమంటున్నారు.టీ కాంగ్రెస్ లో అగ్రనాయకత్వమంతా రెడ్డి సామాజికవర్గమే.

వీరు ఎప్పట్నుంచో కాంగ్రెస్‌కు అండ, దండగా ఉన్నారు.ఎన్ని పార్టీలొచ్చినా వీరు మాత్రం కాంగ్రెస్‌ను మాత్రం వ‌ద‌ల‌డం లేదు.

క‌ష్ట‌కాలంలో కూడా వీరు పార్టీకి అండ‌గా నిల‌బ‌డ్డారు

అయితే తెలంగాణ‌లో బీసీల ఓటింగ్ ఎక్కువ‌.ఇప్పుడు వీరంతా టీ కాంగ్రెస్ అగ్ర‌నాయ‌క‌త్వంపై మండిప‌డుతున్నారు.

గత ఎన్నికల్లో పార్టీకి బలం లేని స్థానాలు బీసీలకు ఇచ్చారని, అందుకే ఒక్క సీటూ గెలవలేదని, ఇప్పుడు ఈ సాకుతో అసలుకే ఎసరు పెడుతున్నారని ఏకంగా అధిష్ఠానానికే బీసీ నేతలు కంప్లైంట్ ఇచ్చారు

వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో త‌మ‌కు రిజ‌ర్వ్ పోను మిగిలిన సీట్లలో సగం సీట్లివ్వకపోతే.వేరే ప్రత్యామ్నాయాలు చూసుకుంటామని హెచ్చరించారట.

టీ కాంగ్రెస్‌లో బీసీ లీడ‌ర్లుగా ఉన్న దానం నాగేంద‌ర్‌, పొన్నం ప్ర‌భాక‌ర్ లాంటి వాళ్లు కూడా ఇప్పుడు పార్టీలో ఇమ‌డ‌లేక‌పోతున్నారు.మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు అయినా బీసీ నాయ‌కుల‌కు, బీసీల‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌క‌పోతే మ‌రింత మున‌గ‌డం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube