టీడీపీ నుంచి ఇద్ద‌రు ఎంపీలు - ఓ ఎమ్మెల్యే అవుట్‌..!

తెలుగు రాజ‌కీయాల్లో టీడీపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పెట్టింది పేరు.అలాంటి టీడీపీ ఏపీలో 2014లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి క్ర‌మ‌శిక్ష‌ణ చాలా గాడి త‌ప్పేసింది.

 Cm Chandrababu Gives A Big Shock To 2 Tdp Mp’s And Mla-TeluguStop.com

గ‌తంలో ఎన్టీఆర్‌, ఆ త‌ర్వాత చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు టీడీపీలో ఉన్న క్ర‌మ‌శిక్ష‌ణ ఇప్పుడు మ‌చ్చుకైనా క‌న‌ప‌డ‌డం లేదు.ఎవ‌రికి వారు ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఓపెన్‌గానే పార్టీ అధినేత‌తో పాటు పార్టీపైనా అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ పార్టీకి తీర‌ని న‌ష్టం క‌లిగిస్తున్నారు.

ఇటీవ‌ల మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న త‌ర్వాత నివురుగ‌ప్పిన నిప్పుల్లా ఉన్న అసంతృప్తి ఒక్క‌సారిగా భ‌గ్గుమంది.మంత్రి ప‌ద‌వి రాని వాళ్లు, మంత్రి ప‌ద‌వి నుంచి ఊస్టింగ్ అయిన వాళ్లు ఇష్టారాజ్యంగా చంద్ర‌బాబును, పార్టీ అధిష్టానాన్ని తిట్టేశారు.

కొంద‌రైతే ప‌ద‌వులకు రాజీనామాలు కూడా చేసి బెదిరించారు.ఇక తాజాగా చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ ఓపెన్‌గానే చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ మాట్లాడ‌డంతో చంద్ర‌బాబు సైతం పార్టీలో ప్ర‌క్షాళ‌న‌కు రెడీ అయ్యారు.

పార్టీ ప్ర‌తిష్ట‌త‌కు భంగం క‌లిగిస్తూ, పార్టీతో పాటు త‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడడం, పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘిస్తోన్న నేత‌ల‌పై నిర్దాక్షిణ్యంగా వేటు వేయాల‌ని ఆయ‌న డెసిష‌న్ తీసుకున్నారు.ఒక‌రిద్ద‌రిపై చ‌ర్య‌లు తీసుకుంటే మిగిలిన వారు లైన్లోకి వ‌స్తార‌ని.

లేకుంటే ఈ వ్యాఖ్య‌లు ఇలా కంటిన్యూ అవుతాయ‌ని చ‌ర్య‌లు ఉప‌క్ర‌మిస్తే త‌ప్ప వీటికి బ్రేక్ ప‌డ‌ద‌ని బాబు మంత్రివర్గ సహచరులకు సీఎం చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఇదే క్ర‌మంలో ముందుగా ఎంపీలు శివ‌ప్ర‌సాద్‌తో పాటు కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు షోకాజ్ నోటీసులు ఇచ్చి స‌రైన వివ‌ర‌ణ రాక‌పోతే పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని బాబు భావిస్తున్నార‌ట‌.

శివ‌ప్ర‌సాద్ మాత్రం పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తే వైసీపీలోకి అయినా వెళ్లిపోయేందుకు త‌న ప్ర‌య‌త్నాలు తాను చేసుకుంటున్న‌ట్టు కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.ఎమ్మెల్యే బొండా ఉమా సైతం జ‌న‌సేన వైపు చూస్తున్న‌ట్టు స‌మాచారం.

మ‌రి పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తే కేశినేని నాని ఏం చేస్తార‌న్న‌దే ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube