మగవారిలో టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గయనడానికి సూచికలు

టెస్టోస్టిరోన్ హార్మోన్ మగవారిలో అతిముఖ్యమైన హార్మోన్.ఫేషియల్ హేర్, గంభీర స్వరం మాత్రమే కాదు, సెక్స్ కోరికలు పుట్టడానికి కూడా టెస్టోస్టిరోన్ హార్మోన్ కారణమవుతుంది.

 Clues That Tell Men About Low Testosterone Levels-TeluguStop.com

ఈ హార్మోన్ ప్రొడక్షన్ తక్కువైతే మాత్రం మగవారి శరీరంలో చాలారకాల మార్పులు వస్తాయి.అలాంటి కొన్ని మార్పుల ద్వారా టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గాయని గమనించి చికిత్స మొదలుపెట్టాలి.

మరి ఆ సూచికలు ఏంటో చూద్దాం!

* ఉదయాన్నే అంగం స్తంభించడం చాలా నేచురల్ గా జరిగే ప్రక్రియ.ఇది ఆరోగ్యవంతమైన సెక్సువల్ డ్రైవ్ కి సూచిక.

ఉదయం పూట అంగస్తంభనలు కాకపోతే అది టెస్టోస్టిరోన్ లెవెల్‌లో తరుగుదలకి సూచిక అని గుర్తించాలి.

* అదేపనిగా డిప్రెషన్ కి గురైతే కూడా టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గుతున్నట్లే లెక్క.

నిజానికి రివర్స్ లో డిప్రేషన్ టెస్టోస్టిరోన్ లో తరుగుదలకి కారణం అవుతుంది.

* అకస్మాత్తుగా బరువు పెరగటం కూడా హార్మోనల్ బ్యాలెన్స్ ని దెబ్బతీస్తుంది.

ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.

* శృంగారంపై ఆసక్తి తగ్గడం టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గడానికి అతిపెద్ద సూచిక.

సెక్స్ డ్రైవ్ ని పూర్తిగా దెబ్బతీస్తుంది లో-టెస్టోస్టీరోన్.

* టెస్టోస్టిరోన్ తగ్గినప్పుడు డయాబెటిస్ ప్రమాదం పెరిగిపోతుంది.

మెటబాలిజం దెబ్బతిని కొలెస్టెరాల్ లెవెల్స్ పెరిగిపోతాయి, బీపి కూడా పెరిగిపోతుంది.

* బాగా అలసటగా ఉండటం, అసలు ఏ పనిలో కూడా ఆసక్తిగా అనిపించకోవడం కూడా లో-టెస్టోస్టీరోన్ కి సూచన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube