లివర్ ని శుభ్రపరుచుకోవడానికి పనికొచ్చే ఆహారం ఇది

ఈకాలంలో మనం తింటున్న తిండికి, మనం తాగే ధ్రవపదార్థాలకి శరీరంలో టాక్సిన్స్ ఎప్పటికప్పుడు చేరుతూనే ఉంటాయి.దీంతో మన ఒంట్లో చాలా భాగాలు ఇబ్బందులని ఎదురుకుంటాయి.

 Clean Your Liver With These Super Foods-TeluguStop.com

మరీ ముఖ్యంగా లివర్.మన మెటబాలిజంని నడిపి, మలీన పదార్ధాలని బయటకి తోసే లివర్ కూడా ఒక్కోసారి అధికంగా టాక్సిన్స్ జమ అవడం వలన ఇబ్బందిపడుతుంది.

లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే దాన్ని మనం శుభ్రపరుచుకోవాలి.అంటే తగిన ఆహారం తీసుకోవాలి.

* నిమ్మరసంలో విటమిన్ సి బాగా లభించడం వలన ఇది టాక్సిన్స్ ని సునాయాసంగా బయటకి తోస్తుంది.దాంతో మీ లివర్ చేసే పని ఈజీ అవుతుంది.

* ఆపిల్ లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది.ఇది టాక్సిన్స్ ని తొలగించడంలో నేర్పరి.

అందుకే డాక్టర్లు రోజుకో ఆపిల్ తినమంటారు.

* పసుపులో సర్కిమున్ ఉండటం వలన డిటాక్సిఫికేషన్ కి ఉపయోగపడుతుంది.

ఫ్యాట్స్ ని కుడా జీర్ణం చేసి బయటకి తోస్తుంది.దీంతో లివర్ మీద పనిఒత్తిడి తగ్గుతుంది.

* వాల్నట్ లో ఒమేగా 3 ఫ్యాట్టి ఆసిడ్స్ మెండుగా ఉంటాయి.ఇవి మీ లివర్ లో ఇరుక్కుపోయే మలినాలు అన్నిటిని కడిగిపడేస్తాయి.

* క్లీన్సేనింగ్ కి అవసరమైన గ్లుకోసినిలేట్ అనే పదార్థం కాలిఫ్లవర్ లో అధికంగా దొరుకుతుంది.ఇది శరీరంలో ఎంజిమ్స్ తయారవడానికి పనికొస్తుంది కాబట్టి మీ లివర్ మీరు తప్పు చేసేదాకా సురక్షితంగా ఉన్నట్లే.

* ఆలివ్ ఆయిల్, అవకాడో కూడా మీ లివర్ ని శుభ్రపరచడానికి ఉపయోగపడే ఆహారాలే

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube