Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

లివర్ ని శుభ్రపరుచుకోవడానికి పనికొచ్చే ఆహారం ఇది-Clean Your Liver With These Super Foods

ఈకాలంలో మనం తింటున్న తిండికి, మనం తాగే ధ్రవపదార్థాలకి శరీరంలో టాక్సిన్స్ ఎప్పటికప్పుడు చేరుతూనే ఉంటాయి. దీంతో మన ఒంట్లో చాలా భాగాలు ఇబ్బందులని ఎదురుకుంటాయి. మరీ ముఖ్యంగా లివర్. మన మెటబాలిజంని నడిపి, మలీన పదార్ధాలని బయటకి తోసే లివర్ కూడా ఒక్కోసారి అధికంగా టాక్సిన్స్ జమ అవడం వలన ఇబ్బందిపడుతుంది. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే దాన్ని మనం శుభ్రపరుచుకోవాలి. అంటే తగిన ఆహారం తీసుకోవాలి.

* నిమ్మరసంలో విటమిన్ సి బాగా లభించడం వలన ఇది టాక్సిన్స్ ని సునాయాసంగా బయటకి తోస్తుంది. దాంతో మీ లివర్ చేసే పని ఈజీ అవుతుంది.

* ఆపిల్ లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది టాక్సిన్స్ ని తొలగించడంలో నేర్పరి. అందుకే డాక్టర్లు రోజుకో ఆపిల్ తినమంటారు.

* పసుపులో సర్కిమున్ ఉండటం వలన డిటాక్సిఫికేషన్ కి ఉపయోగపడుతుంది. ఫ్యాట్స్ ని కుడా జీర్ణం చేసి బయటకి తోస్తుంది. దీంతో లివర్ మీద పనిఒత్తిడి తగ్గుతుంది.

* వాల్నట్ లో ఒమేగా 3 ఫ్యాట్టి ఆసిడ్స్ మెండుగా ఉంటాయి. ఇవి మీ లివర్ లో ఇరుక్కుపోయే మలినాలు అన్నిటిని కడిగిపడేస్తాయి.

* క్లీన్సేనింగ్ కి అవసరమైన గ్లుకోసినిలేట్ అనే పదార్థం కాలిఫ్లవర్ లో అధికంగా దొరుకుతుంది. ఇది శరీరంలో ఎంజిమ్స్ తయారవడానికి పనికొస్తుంది కాబట్టి మీ లివర్ మీరు తప్పు చేసేదాకా సురక్షితంగా ఉన్నట్లే.

* ఆలివ్ ఆయిల్, అవకాడో కూడా మీ లివర్ ని శుభ్రపరచడానికి ఉపయోగపడే ఆహారాలే

Continue Reading
More Posts
To Top