పవన్ కి పోటిగా వెళ్తున్న అల్లు అర్జున్ ?

ఎంతవరకు నిజమో తెలియదు కాని అల్లు అర్జున్ సరిగ్గా వెళ్లి పవర్ స్టార్ తో డీ అంటే డీ అంటున్నాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.సరైనోడు మొదట మార్చిలో వస్తుందని అన్నారు.

 Clash On Between Pawan Kalyan And Allu Arjun ?-TeluguStop.com

ఆ తరువాత ఏప్రిల్ కి షిఫ్ట్ చేసారు.నిజానికి సర్దార్ గబ్బర్ సింగ్ కన్నా ముందే ఏప్రిల్ 8 మీద కన్నేశాడు అల్లు అర్జున్.

తన గత రెండు చిత్రాలు రేసుగుర్రం ఎప్రిల్ 11న విడుదల కాగా, సన్నాఫ్ సత్యమూర్తి ఎప్రిల్ 9 న విడుదల అయ్యింది.ఈ రెండు చిత్రాలు మంచి కలెక్షన్లు రాబట్టుకోవడంతో ఈ ఏప్రిల్ సీజన్ సెంటిమెంట్ గా మారింది అల్లు అర్జున్ కి.

కాని సరిగ్గా ఏప్రిల్ 8 మీదే పవన్ కళ్యాన్ కూడా కన్నేశాడు.సర్దార్ గబ్బర్ సింగ్ ని పంపిణి చేయబోతున్న ఎరోస్ ఇంటర్నేష్నల్ సంస్థ సర్దార్ విడుదల తేదిని ఏప్రిల్ 8గా ప్రకటించింది.

సరైనోడు ఫస్ట్ లుక్ పోస్టర్ లో విడుదల తేది లేకపోయినా, ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.ఇప్పుడు ఆ ఏప్రిల్ 8 వ తేదిని త్యాగం చేసేదెవరు, దాన్నే పట్టుకొని వేలాడేదెవరు ?

అల్లు అర్జున్ తన సెంటిమెంట్ కోసం పవన్ కళ్యాన్ కి పోటిగా వెళ్తాడా ? వెళ్తే నిలుస్తాడా ?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube