టీజర్ టాక్ - చుట్టాలబ్బాయి - పర్లేదు

టైటిల్ చాలా సింపుల్ గా పెట్టేసి ఫామిలీ స్టోరీ అన్న కలరింగ్ ఇచ్చారు గానీ ‘ చుట్టాలబ్బాయి ‘ ట్రైలర్ చూస్తే మాత్రం అలా లేనే లేదు.డైరెక్టర్ వీరభద్రం చౌదరి తనదైన శైలి లో హంగామా చేసి , హీరో ఆది తో కూడా యాక్షన్ ఎపిసోడ్ లు గట్టిగానే లాగేసాడు.

 Chuttalabbayi Teaser Talk-TeluguStop.com

తెలుగు లో వచ్చే మాస్ యాక్షన్ సినిమాల లాగా సుమో చేజింగ్ లూ ఫైట్ లూ బీకరమైన ఫీట్ లూ చేయించినట్టు ఉన్నాడు.ఇందాకే విడుదల అయిన చుట్టాలబ్బాయి టీజర్ చూస్తే విషయం అర్ధం అవుతుంది మరి.

రికవరీ బాబ్జీ పాత్ర లో ఆది పర్ఫెక్ట్ గా సెట్ అవ్వగా 30 ఇయర్స్ పృధ్వీ ” ఇగో రెడ్డి ” గా కనిపించ బోతున్నాడు.ట్రైలర్ లో పృధ్వీ చెప్పిన ” అయితే ఏంటి నా మడత ? ” అనే డైలాగ్ ఈవీవీ సత్యనారాయణ రోజుల నాటి కామెడీ ని గుర్తుకు తెస్తోంది.

గరం తరవాత ఆది నుంచి రాబోతున్న సినిమా ఇదే.ఈ మధ్య కాలం లో ఆది కి సరైన హిట్ లేకపోవడం తో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ప్లాన్ లో ఉన్నాడు మనోడు.భాయ్ సినిమా తరవాత వీరబద్రం చౌదరి చేస్తున్న సినిమా ఇదే కావడం తో ఆయనకీ కూడా ఇది హిట్ అయ్యి తీరాల్సిన పరిస్థితి.మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

ఒక పాట మినహా షూటింగ్ అంతా పూర్తయినట్టు చిత్రబృందం చెబుతోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube