Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

చిరు వ‌ర్సెస్ బాల‌య్య కొత్త ఫైట్‌-Chiru And Balayya Fight For Same Story

Featured

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు ఎన్నో ఏళ్ల తరువాత ఈ సంక్రాంతికి వెండితెర‌పై పోటీ ప‌డుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి విడుదల కానున్న ఈ రెండు చిత్రాలపై ఈ ఇద్ద‌రు అగ్ర హీరోల ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో సైతం భారీ అంచ‌నాలు ఉన్నాయి. వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ ఇక్క‌డితోనే కాదు వీరి నెక్ట్స్ సినిమా విష‌యంలో కూడా ఉన్న‌ట్టు టాలీవుడ్ లేటెస్ట్ అప్‌డేట్‌.

మెగాస్టార్ త‌న రీ ఎంట్రీ మూవీ కోసం ముందుగా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి స్టోరీని తెర‌కెక్కించాడు. ఈ టైటిల్‌తో స్టోరీ లైన్ రెడీ చేయాల‌ని పరుచూరి సోదరులను కోరాడట. ప‌రుచూరి సోద‌రులు మంచి స్క్రిఫ్ట్ రెడీ చేశారు కూడా..అయితే కీల‌క సినిమా కోసం కొత్త క‌థ‌..అది హిస్టారిక‌ల్ స్టోరీతో రిస్క్ చేయ‌డం ఎందుక‌నుకున్న చిరు చివ‌ర‌కు కోలీవుడ్ హిట్ మూవీ క‌త్తి సినిమా రీమేక్‌కు ఓటేశాడు.

మ‌రోవైపు బాల‌య్య హిస్టారిక‌ల్ మూవీ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి స్టోరీతో త‌న 100వ సినిమా పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు అటు చిరు త‌న 151వ సినిమా కోసం ఏదైనా కొత్త‌గా ట్రై చేయాల‌ని అనుకుంటుంటే…. ఇటు బాల‌య్య సైతం త‌న 101వ సినిమాను అదే స్టోరీతో చేయాల‌ని డిసైడ్ అయ్యి ప‌రుచూరి సోద‌రుల‌తో చ‌ర్చించాడ‌ట‌. ఈ విష‌యం చిరుకు తెలియ‌డంతో తాను ఎంతో ఇష్ట‌ప‌డి రాయించుకున్న క‌థ‌ను బాల‌య్య‌కు ఇవ్వ‌వ‌ద్ద‌ని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాడ‌ట‌.

ఇక ఇప్పుడు అటు చిరు , ఇటు బాల‌య్య మ‌ధ్య‌లో ప‌రుచూరి సోద‌రులు న‌లిగిపోతున్నార‌ట‌. మ‌రి ఒకే క‌థ‌కోసం పోటీప‌డుతున్న ఈ టాలీవుడ్ అగ్ర‌హీరోల్లో ఎవ‌రు ఫైన‌ల్‌గా ఈ క‌థ‌ను సొంతం చేసుకుంటారో…చిరు వ‌ర్సెస్ బాల‌య్య మ‌ధ్య ఈ కొత్త ఫైట్ ఎంత వ‌ర‌కు వెళుతుందో చూడాలి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,చిట్కాలు,వీడియోలు, అరుదైన ఫోటోలు క్రింద చూసి చదవండి

More in Telugu Movie News

  • News

    List of Questions Left Unanswered in Baahubali

    By

    2015లో బాహుబ‌లి రిలీజ్ అయ్యాక క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌న్న ఒకే ఒక్క ప్ర‌శ్న ఇండియ‌న్ సినిమా జ‌నాల మ‌దిని ఓ...

  • News

    Gaddar Willing To Work With Pawan Kalyan

    By

    గ‌బ్బ‌ర్ సింగ్ ఇక్క‌డ అంటే ఫ్యాన్స్ ఈల‌లు వేశారు. గ‌ద్ద‌ర్ ఇక్క‌డ అంటే జ‌నాలు చ‌ప్ప‌ట్లు కొట్టారు. ఇప్పుడ‌నే కాదు ఎప్పుడు...

  • News

    Baahubali Ticket Price Increased to 75%..?

    By

    రాజ‌మౌళి బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రో మూడు రోజుల టైం మాత్ర‌మే ఉంది. ఈ సినిమాపై ఉన్న...

  • News

    RGV Praising Rajamouli’s Beauty

    By

    ఉన్న‌ట్టుండి క్రియెటివ్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ త‌న పంథా మార్చేసుకున్నారు. ఎప్పుడూ సెన్సేష‌న్ స్టేట్‌మెంట్స్‌తో హ‌డ‌లెత్తించే రామూ ఈ సారి...

To Top
Loading..