ఇందుకే చిరు లండన్‌ వెళ్లాడు

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా గురించి ఎక్కడ చూసినా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.ఈ సినిమా కోసం చిరంజీవి ఎన్నో కష్టాలు పడుతూ తన బాడీని మునుపటి రూపంకు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

 Chiranjeevi’s London Tour On A Purpose-TeluguStop.com

తాజాగా చిరంజీవి లండన్‌ పర్యటకు వెళ్లాడు.కుటుంబ సమేతంగా చిరు లండన్‌కు వెళ్లగా అక్కడకు సినిమా కోసమే వెళ్లాడు అంటూ ప్రచారం మొదలు పెట్టారు.

అక్కడ మొహంపై ఉన్న ముడతలు తొలగించుకుని, యవ్వన రూపంను పొందాలని చిరు వెళ్లాడు అంటూ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి.కాని అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అని తేలిపోయింది.

మెగాస్టార్‌ చిరంజీవి తన చిన్న కూతురు శ్రిజ లండన్‌లో ఒక ప్రముఖ యూనివర్శిటీలో మాస్టర్స్‌ పూర్తి చేసింది.ఆ మాస్టర్స్‌ డిగ్రీ అందుకుంటున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు అయిన చిరంజీవి, సురేఖలు విచ్చేశారు.

అంతే తప్ప మరే ఇతర కారణంతో చిరు లండన్‌కు వెళ్లలేదని అంటున్నారు.కూతురు కాన్వగేషన్‌ పూర్తి అయిన తర్వాత కొన్ని రోజులు జాలీగా గడిపి తిరిగి ఇండియాకు తిరిగి వచ్చేనున్నట్లుగా మెగా సన్నిహితులు చెబుతున్నారు.

ఇక చిరు 150వ సినిమా ఆగస్టులో ప్రారంభం కానున్న విషయం తెల్సిందే.పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube