బీజేపీ గూటికి చిరు... ఆఫ‌ర్ ఇదే

ఏపీ బీజేపీలో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకోనుందా ? ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధ‌మైందా ? అంటే అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది.ప్ర‌స్తుతం ఏపీలో కాపు ఉద్య‌మం బ‌లంగా న‌డుస్తోంది.

 Chiranjeevi To Join Bjp?-TeluguStop.com

కాపుల‌ను బీసీల్లో చేర్చాల‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం త‌ల‌కెత్తుకోన్న ఉద్య‌మం ఎఫెక్ట్‌తో ఇక్క‌డ కాపులు రాజ‌కీయంగా కీల‌క ప్యాక్ట‌ర్‌గా మారారు.

ఈ క్ర‌మంలోనే కాపుల‌ను త‌మ వైపున‌కు తిప్పుకునే ప్లాన్‌లో ఉన్న బీజేపీ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా అదే సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్సీ కాపు వీర్రాజును నియ‌మించ‌నుంది.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏపీ నుంచి కేంద్రంలో వెంక‌య్య‌నాయుడు చ‌క్రం తిప్పుతుండ‌డం, చంద్ర‌బాబుకు అండ‌గా ఉండ‌డంతో బీజేపీ.టీడీపీల మ‌ధ్య స‌ఖ్య‌త కొన‌సాగింది.

ఇప్పుడు ఏపీ బీజేపీ మొత్తం రాం మాధ‌వ్ కంట్రోల్‌లోకి వెళ్లిపోవ‌డంతో ఇప్పుడు ఏపీలోని కాపుల‌ను బీజేపీ వైపున‌కు మ‌ళ్లించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ఫ్యూచ‌ర్‌లో బీజేపీ ఒంట‌రిగా ఎదిగే ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఈ క్ర‌మంలోను ఏపీలో బ‌లంగా ఉన్న కాపుల‌ను ఎట్రాక్ట్ చేసే ప్ర‌య‌త్నాలు చేస్తోంది.ప్ర‌స్తుతం కాంగ్రెస్ నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాథినిత్యం వ‌హిస్తోన్న మెగాస్టార్ చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించి ఆయ‌న్ను మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు పంప‌డం ద్వారా.

ఇక్క‌డ ఏపీలోనూ ఆయ‌న‌ను వాడుకోవ‌చ్చిన బీజేపీ భావిస్తోంది.

ఇటు చిరును రాజ్య‌స‌భ‌కు పంప‌డం, అటు అదే వ‌ర్గానికి చెందిన సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డంతో ఏపీలో కాపు సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవాల‌ని భావిస్తోంది.

ఇలా చేయ‌డం ద్వారా కాపులు బ‌లంగా విస్త‌రించి ఉన్న ప‌శ్చిమ‌, తూర్పు గోదావ‌రి, గుంటూరు, కృష్ణాల్లో పాగా వేయొచ్చ‌ని బీజేపీ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.ప్ర‌స్తుతం కాంగ్రెస్ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న చిరుకు ఆ పార్టీలో ఫ్యూచ‌ర్ లేక‌పోవ‌డంతో బీజేపీలోకి వెళ్లేందుకు సుముఖంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

బీజేపీ గూటికి చిరు… ఆఫ‌ర్ ఇదే

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube