చిరంజీవి సిక్స్‌ ప్యాకా?

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా గురించి మీడియాలో ప్రతి రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.గత రెండు మూడు రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీదేవి నటించబోతుందంటూ వార్తలు వస్తున్నాయి.

 Chiranjeevi Six Pack In 150th Movie-TeluguStop.com

ఆ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కాని తాజాగా మరో వార్త టాలీవుడ్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో వస్తుంది.నమ్మశక్యంగా లేని ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా ఉంది.

అన్ని వుడ్‌లలో ప్రస్తుతం ఫేమస్‌ అయిన సిక్స్‌ ప్యాక్‌ను చిరంజీవి ట్రై చేస్తున్నాడని, 150వ సినిమాలో చిరు సిక్స్‌ ప్యాక్‌తో కనిపించబోతున్నట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.

ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా కోసం కసరత్తులు చేస్తున్న విషయం తెల్సిందే.

కథ, దర్శకుడితో పాటు బాడీపై అత్యధిక శ్రద్ద పెడుతున్నాడు.గతంలో మాదిరిగా కనిపించేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.150వ సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ బాడీలో కనిపిస్తే ప్రత్యేకంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో కాస్త ఇబ్బంది అయినా ఈ వయస్సులో సిక్స్‌ ప్యాక్‌ బాడీ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు.అయితే ఈ వార్తల్లో నిజం ఉండి ఉండదు అంటూ మెగా ఫ్యాన్స్‌లోని కొంత మంది అంటున్నారు.

చిరుకు సిక్స్‌ ప్యాక్‌ చూపించాల్సిన అవసరం లేదని, ఆయనకున్న క్రేజ్‌కు ఎలా ఉన్నా చూస్తారు అంటూ ఫ్యాన్స్‌ సిక్స్‌ ప్యాక్‌ వార్తలను తోసిపుచ్చుతున్నారు.ఆగస్టులో చిరంజీవి 150వ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ గట్టిగా వినిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube