వైసీపీలోకి చిరంజీవి..!

ప్ర‌ముఖ సినీన‌టుడు, కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కాంగ్రెస్‌ను, కాంగ్రెస్ నాయ‌క‌త్వం చిరంజీవిని వ‌దులుకున్న‌ట్టే ఏపీలో తాజా రాజ‌కీయ ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్య‌స‌భ‌కు ఎంపీగా ఎన్నికై, ఆ త‌ర్వాత కేంద్ర‌మంత్రిగా ప‌నిచేసిన చిరు చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 Chiranjeevi Joining Ysrcp??-TeluguStop.com

తాజాగా కాంగ్రెస్ పార్టీ గుంటూరులో ప్ర‌త్యేక హోదా పేరుతో బ‌హిరంగ స‌భ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించింది.ఈ స‌హ‌కు రాహుల్‌గాంధీతో పాటు జాతీయ‌స్థాయి నేత‌లు అయిన‌ శరద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ, సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి.రాజాతో పాటు డీఎంకె నేతలు హాజర‌య్యారు.ఇంత‌మంది వ‌చ్చినా చిరు మాత్రం ఇక్క‌డ‌కు రాక‌పోవ‌డంతో ఆయ‌నకు కాంగ్రెస్‌లో కంటిన్యూ అయ్యే ఉద్దేశం లేదంటున్నారు.

ఈ ప‌ర్య‌ట‌న‌కు రాహుల్‌ను ఆహ్వానించేందుకు ఏపీ కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీ వెళ్లినా చిరు మాత్రం డుమ్మాకొట్టారు.ఆ త‌ర్వాత చిరు స‌భ‌కు వ‌స్తాడ‌ని ర‌ఘువీరా లాంటి వాళ్లు మ్యానేజ్ చేసినా ఆయ‌న స‌భ‌కు రాలేదు.

దీంతో చిరు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్ప‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు జ‌రుగుతుంటే కాంగ్రెస్ వాళ్లు మాత్రం చిరు విదేశీ టూర్‌లో ఉండ‌డంతోనే రాలేక‌పోయార‌ని క‌వ‌ర్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే చిరు ఇటీవ‌లే వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను న్యూజీలాండ్‌లో భేటీ అయిన‌ట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

తాను వైసీపీలో చేరితే త‌న‌కు ల‌భించే ప్ర‌యారిటీ అంశంపై జ‌గ‌న్‌-చిరు మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగా ఎప్పుడైనా చిరు వైసీపీలో చేర‌తార‌ని.ఆయ‌న‌కు జ‌గ‌న్ మ‌రోసారి రాజ్య‌స‌భ రెన్యువ‌ల్‌పై హామీ ఇచ్చార‌న్న టాక్ కూడా ఇంట‌ర్న‌ల్‌గా వినిపిస్తోంది.ఏదేమైనా చిరు మాత్రం కాంగ్రెస్‌తో క‌లిసి వెళ్లే విష‌యంలో సుముఖంగా లేన‌ట్టే అర్థ‌మ‌వుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube