రాజ‌కీయాల‌కు చిరు గుడ్ బై..!

మెగాస్టార్‌గా రెండున్న‌ర ద‌శాబ్దాల పాటు వెండితెర‌ను ఏలిన చిరంజీవి త‌న రీ ఎంట్రీ సినిమా, కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాడు.ఖైదీ నెంబ‌ర్ 150 నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టేసి రూ.100 కోట్ల షేర్ సాధించింది.ఈ క్ర‌మంలోనే చిరు ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.

 Chiranjeevi Goodbye To Politics-TeluguStop.com

అప్పుడే చిరు 151వ సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ అవుతోంది.ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి స్టోరీయే చిరు 151వ సినిమాగా తెర‌కెక్కుతుంద‌ని.ఈ సినిమాకు సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని టాక్‌.ఈ సినిమాను కూడా చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణే నిర్మించ‌నున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.ఇక ఈ సినిమా త‌ర్వాత చిరు 152వ సినిమా బోయ‌పాటి శ్రీను డైరెక్ష‌న్‌లో తెర‌కెక్క‌నుంది.

చిరు వ‌రుస‌గా సినిమాల‌కు రెడీ అవుతుండ‌డం చూస్తుంటే రాజ‌కీయాల‌కు ఇక దూరమైన‌ట్టే అన్న చ‌ర్చ‌లు అటు రాజ‌కీయ‌వ‌ర్గాల‌తో పాటు ఇటు సినీ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించి 2009 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన చిరు త‌ర్వాత త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు.

అదే పార్టీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపికై కేంద్ర‌మంత్రిగా కూడా ప‌నిచేశారు.

చిరు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు.

తిరిగి ఖైదీ సినిమాతో తాను వెండితెర రారాజును అన్న బిరుదు మ‌రోసారి సార్థ‌కం చేసుకున్నారు.ఖైదీ హిట్ జోష్‌లో ఉన్న చిరు తిరిగి సినిమాల్లోకి రావ‌డం త‌న‌కు చాలా రిలీఫ్‌గా ఉంద‌ని చెప్పారు.

ఈ వ్యాఖ్య‌ల‌తో పాటు చిరు వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతుండ‌డం చూస్తుంటే చిరు ఇక రాజ‌కీయాల‌కు రాంరాం చెప్పేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.

ఇక ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచ‌ర్ లేదు.

దీంతో వైసీపీలోకి, టీడీపీలోకి వెళ్లేందుకు చిరు సుముఖంగా లేన‌ట్టే క‌న‌ప‌డుతోంది.ఇవ‌న్నీ చూస్తుంటే చిరు రాజ‌కీయాల‌కు దూరంగా సినిమాలకే ఫిక్సైపోయిన‌ట్టు క‌న‌ప‌డుతోంది.

మ‌రి మెగాస్టార్ పొలిటిక‌ల్‌గా ఏదైనా కొత్త డెసిష‌న్ తీసుకుంటాడా ? అన్న‌ది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube