తేల్చేసిన చిరు

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా కసరత్తులు జరుగుతున్నాయి.

 Chiranjeevi Gives Clarity On 150th Movie-TeluguStop.com

కాని కథ మాత్రం ఫైనల్‌ అవ్వడం లేదు.తాజాగా తనయుడు రామ్‌చరణ్‌ తాజా చిత్రం ‘బ్రూస్‌లీ’ ఆడియో విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి తన 150వ సినిమాపై ఒక క్లారిటీ ఇచ్చాడు.

మరో వారం లేదా పది రోజుల్లోనే 150వ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అన్నాడు.అన్ని అనుకున్నట్లుగా అయితే ‘బ్రూస్‌లీ’ చిత్రం విడుదలకు ముందే స్వయంగా తన 150వ సినిమాకు నిర్మాతలు అయినా రామ్‌ చరణ్‌, సురేఖలు ప్రకటిస్తారు అంటూ చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు.

ఇక చరణ్‌ ‘బ్రూస్‌లీ’ గురించి చిరంజీవి మాట్లాడుతూ.ఈ సినిమా కోసం చరణ్‌ ఎంతగా కష్టపడ్డాడో, పడుతున్నాడో నాకు తెలుసు.

రోజుకు 18 నుండి 20 గంటల పాటు ఈ సినిమా కోసం చరణ్‌ కష్టపడుతున్నాడు అని చిరు చెప్పుకొచ్చాడు.‘బ్రూస్‌లీ’ చిత్రంలో చిరంజీవి చిన్న గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్న విషయం తెల్సిందే.

చిరు 150వ సినిమాకు ఇది ఒక ట్రైలర్‌లా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube