ఆమె అందంపై చిరు కామెంట్స్‌!!

మెగా స్టార్‌ చిరంజీవి సినిమాల్లో లేకపోయినా కూడా ఇండస్ట్రీకి దగ్గరగానే ఉంటూ వస్తున్నాడు.ఎప్పటికప్పుడు హీరోయిన్స్‌పై ప్రశంసలు కురిపిస్తూ వచ్చాడు, వస్తున్నాడు.

 Chiranjeevi Commetns On Rakul Preeth-TeluguStop.com

‘రచ్చ’ సినిమా సమయంలో తమన్నాపై ప్రశంసల జల్లు కురిపించిన చిరంజీవి ఆ తర్వాత ఒక సమయంలో సమంతను పొగడ్తలతో ముంచెత్తాడు.తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందాలపై కామెంట్స్‌ చేశాడు.

స్వయంగా రకుల్‌ అందం గురించి ఆమెతోనే చెప్పాడట.

ఈ విషయాన్ని స్వయంగా రకుల్‌ వెళ్లడిస్తూ.

‘బ్రూస్‌లీ’ చిత్రంలో చిరంజీవి గారితో ఒక సీన్‌లో నటించాను.జీవితంలో చిరంజీవి గారితో నటిస్తానా అని అనుకున్నాను.

ఆ ఒక్క సీన్‌ జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.ఇక చిరు తనతో ‘లే చలో.’ పాటలో చాలా అందంగా ఉన్నావని, ఆ పాటకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కడం ఖాయం అని, ఈ సినిమాతో నీ క్రేజ్‌ మరింతగా పెరుగుందని కూడా అన్నాడు అంటూ సంబర పడుతూ చెబుతోంది.చిరు ప్రశంసలతో రకుల్‌ గాల్లో తేలిపోతుంది.

ఇక ఈమె ప్రస్తుతం ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ల చిత్రాల్లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube