ఎక్కువ చేస్తున్న చిరంజీవి, మహేష్ బాబు

8 సంవత్సరాల తరువాత చేస్తున్న సినిమా.కాబట్టి అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లోనూ భారి అంచనాలు ఉంటాయి.

 Chiranjeevi And Mahesh Babu Are Going Hard On Overseas Distributors-TeluguStop.com

ఇది ఒక పాయింట్.రజినీకాంత్ కబాలి ఓవర్సీస్ లో దుమ్మురేపింది.

తమిళ సినిమాలకి పెద్దగా మార్కేట్ లేని అమెరికాలో $4 మిలియన్ల వసూళ్ళు రాబట్టింది.ఇది రెండో పాయింట్.

ఈ రెండు పాయింట్స్ చెబుతూ ఖైది నెం.150 ఓవర్సీస్ హక్కులను 15 కోట్లకి తక్కువ అమ్మేది లేదని ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ భిష్మించుకు కూర్చుంటే, మరోవైపు అంతకు మించి అన్న తరహాలో ఓవర్సీస్ పంపిణీదారులు చుక్కలు లెక్కపెట్టేలా చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

చిరంజీవి సినిమాకి 15 కోట్లు అడిగితే, మహేష్ తదుపరి చిత్రానికి ఏకంగా 18-20 కోట్ల రేటు చెబుతున్నారట.సినిమా హిట్ అయితే లాగేస్తారు ఓకే కాని, ఫ్లాప్ అయితే మా పరిస్థితి ఏంటి? సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం రూపంలో ఇప్పటికే రెండు పెద్ద చురకలు తగిలాయి, అయినా సరే వీళ్ళు ఏమాత్రం తగ్గకుండా ఈ రేట్లు చెబుతున్నారు.అవి డబ్బు కట్టలు, కాగితపు కట్టలు కావు అని వీరికి ఎవరైనా చెబితే బాగుండు అని గొణుక్కుంటున్నారు ఓవర్సీస్ బయ్యర్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube