24 కోట్ల అప్పు ఎగ్గొట్టేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న మహిళ

ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇక్కడ అందరికి తెలుసుగా.తెలిసి ఉంటుందిగా.

 Chinese Woman Tries To Escape 24 Cr Debts With Plastic Surgery-TeluguStop.com

సినిమాల్లోనే కాదు, ఈమధ్య తెలుగు టీవి సీరియల్స్ లో లాజిక్ పక్కన పెట్టి మరీ ప్లాస్టిక్ సర్జరీ కాన్సెప్ట్ వాడుతున్నారు.అర్థమయ్యేలా చెప్పాలంటే రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమా గుర్తుందిగా.

అందులో అల్లు అర్జున్ – కాజల్ మీద ఓ దాడి జరుగుతుంది.ఆ దాడిలో కాజల్ చనిపోతే అల్లు అర్జున్ కాలిన గాయాలతో బయటపడతాడు.

అతడికి చనిపోయిన తన కొడుకు ముఖం అంటించి ప్లాస్టిక్ సర్జరీ చేస్తుంది జయసుధ.దాంతో అల్లు అర్జున్ కాస్త రామ్ చరణ్ గా మారతాడు.

హాలివుడ్ సినిమా ఫేస్ ఆఫ్ ని ఆధారంగా తీసుకున్న సినిమా అప్పట్లో మంచి వసూళ్లు సాధించింది.ఇప్పుడు ఈ సినిమా టాపిక్ ఎందుకంటే ప్లాస్టిక్ సర్జరీని చాలా చలాకీగా వాడుకొని కోట్ల రూపాయలు ఎగ్గొట్టే ప్రయత్నం చేసింది ఓ చైనా మహిళ.

వివరాల్లోకి వెళితే 59 ఏళ్ల జూ నాజువాన్ అప్పుల్లో కూరుకుపోయింది.ఆమె 25 మిలియన్ల యువాన్ల అప్పు ఉన్నట్లు తేల్చింది కోర్టు.

భారతీయ కరెన్సీ ప్రకారం చెప్పాలంటే దాదాపుగా 24 కోట్ల రూపాయలు.అప్పుని చెల్లించని యెడల నాజువాన్ పై న్యాయపరమైన చర్యలు ఉండేవి.

అప్పుడు ఆమెకి ఒక మాస్టర్ ప్లాన్ తట్టింది.అది తన ముఖాన్ని ఎవరు గుర్తుపట్టకుండా మార్చుకోవడం.

నాన్నకు ప్రేమతో సినిమాలో మాదిరి కేవలం కనుబొమ్మలు తీసేయడం కాదు, పూర్తిగా ముఖాన్ని మార్చేయాలని అనుకుంది.అంతే, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.

అది కూడా ఎలా అంటే 59 ఏళ్ల ముసలావిడ 30 ఏళ్ల మహిళలా కనబడేలా.అలా సర్జరీ చేయించుకున్న తరువాత దక్షిణ చైనాలోని మరో సిటిలోకి మకాం మార్చింది.

తన కార్డ్స్ వాడకుండా, వేరే వాళ్ళ కార్డ్స్ తో ఖర్చులు పెట్టుకుంది.సర్జరీ కూడా వేరే వాళ్ళ కార్డుతో చేయించుకుంది.తన ప్రయాణాల ఖర్చు కూడా వేరే వాళ్ళ కార్డ్స్ తోనే కానిచ్చింది.ఆ రకంగా తను ఎక్కడ ఉన్నది పోలీసులకి తెలియకుండా జాగ్రత్తపడింది.

మరి ఎలా కనిపెట్టారో, ఆవిడని ఎలా ట్రాక్ చేసారో కాని మొత్తానికి పోలీసులని నాజువాన్ జాడ తెలుసుకున్నారు.అక్కడికి వెళ్లి చూస్తే 30 ఏళ్ళు దాటినా మహిళలా ఉంది.

పోలీసులు షాక్ కి గురయ్యారు అంట.మా కళ్ళని మేము నమ్మలేకపోతున్నాం, పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంది ఆవిడ.అయినా సరే తన మోసాన్ని దాచలేకపోయింది అంటూ చెప్పుకొచ్చారు చైనా పోలీసులు.

ఎదో ఇంగ్లీష్ సినిమాలా ఉంది కదూ ఈ కథ.ఇంత పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకోవడం క్రిస్టోఫర్ నోలాన్ కి కూడా కష్టమైన విషయం ఏమో.ఎలా తయారవుతున్నారు చూడండి మనుషులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube