ముద్దుల పండగ అంట, ఎవరినైనా సరే ముద్దు పెట్టుకోవచ్చు

తెలంగాణ లో దసరా అనేది చాలా పెద్ద పండుగ.సంక్రాంతికి ఎవరికి ఊరికి వారు వెళతారో లేదో తెలియదు కాని దసరాకి మాత్రం ఊరిలో ఉండాల్సిందే‌.

 Chinese Villagers Celebrate Kissing Festival Where People Kiss Each Other-TeluguStop.com

పూజలు ఇలా పూర్తవగానే ఊరంతా డప్పుల చప్పుళ్ళతో జంబి చెట్టు దగ్గరికి బయలుదేరుతుంది.పూజలు చేసిన జంబి చెట్టు నుంచి ఆకు తెంపి, ఆ ఆకు ఒకరితో ఒకరితో పంచుకుంటూ, పురుషులు – పురుషులు, స్త్రీలు – స్త్రీలు అయితే ఆలింగనాలు చేసుకుంటూ, భిన్న లింగాల వారైతే నమక్కరించుకుంటూ లేదా కరచాలనం చేసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటారు‌.

ఆ రోజు మనుషుల మధ్య ఎలాంటి తేడాలు ఉండవు.శతృవులు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటారు‌

చైనాలోని అబా ప్రాంతంలో ఇలాంటి పండగే ఒకటి ఉంది.

మనుషులని పలకరించటం, శుభాకాంక్షలు తెలుపుకోవడంలో దసరాని పోలి ఉన్న ఓ వైరైటి పండగ జరుపుకుంటారు ఇక్కడి జనాలు.అబాలో నివసించే టిబేటన్లు, అందులోనూ పశువుల కాపర్లు ఈ ముద్దుల పండగ జరుపుకుంటారు.

ఊరంతా పండగరోజు ఓ చోట చేరి పూజలు చేసి, అచ్చం దసరాకి కోలలు ఆడుకుంటున్నట్లు, చైనీస్ జానపద పాటలు పాడుకుంటారు.నృత్యాలు చేస్తారు‌.

ఈ కార్యక్రమాలు పూర్తవగానే ఆడ, మగ, వావి వరసలు, ఆడ-ఆడ, మగ-మగ అనే తేడా లేకుండా అందరు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముద్దులు పెట్టుకోవాలి‌.యువతీయువకులైనా ఇంతే, మొహమాటం లేకుండా ముద్దుపెట్టుకుంటారు

ఇది పాశ్చాత్య పోకడేమో, పబ్లిక్ లో అందరి ముందు పెదాల మీద ఒకరి తరువాత ఒకరిని అలా ముద్దుపెట్టుకోవడం ఆసియా సంప్రదాయం కాదేమో అనుకోకండి, ఈ పండగకు వందల ఏళ్ళ చరిత్ర ఉందట‌‌.

ఒకప్పుడు సైనికులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు, వారికి తమ ప్రేమను తెలపడానికి ప్రజలు ఇలా ముద్దులుపెట్టేవారట.అలా మొదలైందట ఈ పండగ.

చాలా చిత్రంగా ఉంది కదూ‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube