చైనా మరో రికార్డు

మన పొరుగున ఉన్న చైనా కేవలం జనాభాలోనే రికార్డు సృష్టించలేదు.సాంకేతిక విజయాల్లోనూ అనేక రికార్డులు నెలకొల్పింది.

 China Begins Construction Of Asia’s Largest Suspension Bridge-TeluguStop.com

ఆర్థికంగానూ అద్భుత విజయాలు సాధిస్తోంది.ఆ దేశం మళ్లీ మరో రికార్డు నెలకొల్పబోతున్నది.

ఆ దేశంలోని యున్నాన్‌ ప్రావిన్‌్సలో ఉన్న లాంగ్‌ జియాంగ్‌ నది మీద ఆసియాలోనే అతి పెద్దదైన ‘సస్పెన్షన్‌ బ్రిడ్జి’ నిర్మాణం ప్రారంభించింది.ఈ బ్రిడ్జి పొడవు రెండువేల నాలుగొందల డెబ్బయ్‌ మీటర్లు.

దీన్ని పర్వత ప్రాంతంలో నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది జూన్‌లో దీన్ని ప్రారంభిస్తారు.

అంటే ఏడాది తిరగేసరికి దీని నిర్మాణం పూర్తవుతుందన్నమాట.మన దేశంలో ఓ భవనం కట్టడానికే దశాబ్దం పడుతుంది.

కొన్ని నిర్మాణాలు సగంలోనే ఆగిపోతాయి.ఇక నాణ్యత సంగతి చెప్పనక్కర్లేదు.

డబ్బు మిగిలించుకోవాలనే ధ్యాసే తప్ప ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించాలని అనుకోరు.మన దేశంలో నిర్మాణాలకు కోట్లు ఖర్చు చేస్తున్నా అదంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది.

చైనా వారిని చూసి నేర్చుకోవల్సింది చాలా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube