హీరోయిన్స్‌తో మీడియా వారు పెళ్లి ప్రస్థావన తెచ్చిన ప్రతీ సారి కూడా ఏదో ఒక వంక చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.ప్రేమ మరియు పెళ్లి వ్యవహారాల్లో మీడియాతో హీరోలు అయినా, హీరోయిన్స్ అయినా కాస్త దూరంగా ఉంటూ ఉంటారు.
తాజాగా ఛార్మి కూడా మీడియా వారు పెళ్లి విషయం అడిగిన వెంటనే కామెడీ చేసింది.తాను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని, ఎందుకంటే తనకు పిచ్చి ఉందని, ఆ పిచ్చిని పెళ్లి చేసుకోబోయేవాడు తట్టుకోవడం కష్టం అని ఈమె చెప్పుకొచ్చింది.
కుటుంబ సభ్యులు తన పిచ్చిని భరిస్తున్నారు తప్ప మరెవ్వరైనా కూడా ఈ పిచ్చిదాన్ని భరించగలిగే శక్తిని కలిగి ఉండరు అని తనపై తానే కామెంట్స్ చేసుకుంది.తాజాగా ఈమె నటించిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమా విడుదల సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈమె తన పెళ్లిపై ఇలా కామెడీ చేసింది.
ఇక గతంలో ఈమె పెళ్లి చేసుకోబోతున్నట్లుగా పలు సార్లు మీడియాలో వార్తలు వచ్చాయి.ఈమె ప్రేమలో ఉన్నట్లుగా కూడా పుకార్లు పుట్టుకు వచ్చాయి.
మరి ఈమె పెళ్లి వార్తలు మళ్లీ మీడియాలో ఎప్పుడు వస్తాయో చూడాలి.అన్నట్లుగానే ఈమె పెళ్లికి దూరంగా ఉంటుందేమో కూడా చూడాలి.