విచారణకు ముందు పూరిని సీక్రెట్ గా కలిసిన ఛార్మీ - అక్కడే ప్లాన్ ?

రాజ్యాంగంలో ఉన్న చిన్న చిన్న సడలింపులని ఎలా ఉపయోగించుకోవాలో లాయర్స్ కి తెలుసు, అలాగే పెద్ద పెద్ద లాయర్లని నియమించుకునే బడా బాబులకి తెలుసు.డ్రగ్స్ కేసులో నిన్న ఛార్మీపై జరిగిన విచారణ పెద్దగా సత్ఫలితాలను ఇవ్వలేదు.

 Charmee Met Puri Before Interrogation – Planned How To Behave-TeluguStop.com

ఫోటోలు, వాట్సాప్ చాట్ .ఇలాంటి సాక్ష్యాలు ఉన్నా ఛార్మీని గట్టిగా నిలదీయలేకపోయింది సిట్ టీమ్.ఈ విచారణని ప్లాన్ చేసింది సిట్ టీం అయినా, దాన్ని ఎలా ఎదుర్కోవాలో అంతకంటే పకడ్బందీగా ప్లాన్ చేసింది పూరి జగన్నాథ్ టీం.నటుడు సుబ్బరాజు, సినిమాటోగ్రాఫర్ శ్యాం కె నాయుడు డ్రగ్స్ మాఫియాలో పూరి ఇన్వాల్వ్మెంట్ గురించి కీలక సమాచారం లీక్ చేసారు.దాంతో జాగ్రత్తలో పడ్డారు మన అగ్రదర్శకుడు.తన క్యాంపు వారు సిట్ కి లొంగకుండా, అందులోనూ తనకు అత్యంత సన్నిహితురాలైన ఛార్మీ ద్వారా ఎలాంటి సమాచారం రాబట్టకుండా పెద్ద పెద్ద లాయర్లతో మాట్లాడి స్కెచ్ వేసారు.

అందులో మొదటి విజయం ఎక్కడ సాధించారంటే, ఇప్పటికి వరకు సస్పెక్ట్స్ ని విచారిస్తూ వచ్చిన అకున్ సబర్వాల్ అండ్ టీం ఛార్మీని విచారించకుండా అడ్డుకోవడం ద్వారా.కోర్టు కి వెళ్లి మరి కేవలం మహిళలే తనని విచారించేలా చేసుకుంది ఛార్మీ.

నిన్న 10 గంటలకు విచారణ మొదలవుతుంది అనగా, రెండు మూడు రోజుల నుంచే పూరితో మంతనాలు జరిపింది అంట ఛార్మీ.ఫోన్ లో మాట్లాడకుండా పర్సనల్ గా వెళ్లి కలిసిందట.

నిన్న కూడా విచారణకు ముందు, అంటే ఉదయం పైసా వసూల్ సెట్స్ కి వెళ్లి పూరితో మంతనాలు జరిపిందట.విచారణలో దూకుడుగా ఉండమని, ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని పూరి సజెస్ట్ చేసారట.

ఛార్మీ దూకుడు ఇలా ఎంటర్ అయ్యిందో లేదో అలా మొదలయ్యింది.కానిస్టేబుల్ తనని తాకాడంటూ హంగామా చేసింది.

ఆ పోలీసుపై చర్యలు తీసుకోవాలంటూ కంప్లయింట్ చేసింది.అయిదుగురు బౌన్సర్లని వెనసుకొని వచ్చింది.

ఎలాంటి విషయాలపై మౌనంగా ఉండాలో, ఎలాంటి విషయాలు అడిగినప్పుడు అధికారుల మీదకి తిరగబడాలో, అన్ని సినిమా స్క్రిప్టు రాసుకున్నంత పగడ్బందీగా రాసుకున్నట్టు ఉన్నారు.ఆ ప్లాన్ నే అమలు చేసారు.

అందుకే కొత్త పేర్లు బయటకి రాలేదు.కనీసం ఛార్మీ డ్రగ్స్ తీసుకుంటుందో లేదో టెస్టు చేద్దామన్నా, ఆ అవకాశం లేదు.

బ్లడ్ శాంపిల్స్ తీసుకోనివ్వలేదు.ఛార్మీ చేసిన ఈ ఎటాక్ కి మరి కౌంటర్ ఎటాక్ ఎప్పుడు ఇస్తుందో సిట్ టీమ్ !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube