Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

వైసీపీ ఎమ్మెల్యేకు ఫుల్ ప‌వ‌ర్స్ ఇచ్చిన బాబు-Chandrababu Shock To TDP Senior Leader

ప్ర‌తిపక్ష వైసీపీ నుంచి నాయ‌కుల‌ను చేర్చుకున్నప్పుడు క‌నిపించిన ఉత్సాహం టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌నిపించ‌డంలేదు. ఆయా నాయ‌కుల చేరితో పార్టీ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని ఊహించిన ఆయ‌న‌కు.. ఆయా నియోజ‌కవ‌ర్గాల్లో ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. క‌డ‌ప‌, క‌ర్నూలు.. ఇలా రాయ‌లసీమ జిల్లాల్లో ఇప్పుడు వ‌ర్గ‌పోరు ముదిరిపోయింది. ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలోనూ ఇది బ‌హిర్గత‌మైంది. ముఖ్యంగా ఆ జిల్లా కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రాంకు బాబు షాక్ ఇచ్చారు. క‌ర‌ణం కంచుకోట అయిన అద్దంకిపై ఆశ‌లు వ‌దులుకోవాల‌ని తేల్చి చెప్పారు. పార్టీ ఆదేశాలు ధిక్క‌రిస్తే ఇక ఉపేక్షించేది లేద‌ని స్ప‌ష్టంచేశార‌ట‌.

అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో క‌ర‌ణం బ‌ల‌రాం, గొట్టిపాటి ర‌వికుమార్ వ‌ర్గాల మ‌ధ్య వైరం ఉంది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన గొట్టిపాటి.. ఇటీవ‌లే టీడీపీలో చేరారు. దీనిని క‌ర‌ణం బ‌ల‌రాం వ్య‌తిరేకించినా.. కరణం ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకే చంద్రబాబు… రవికుమార్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కథనాలు వచ్చాయి. ఆయ‌న పార్టీలో చేరిన అనంత‌రం.. ఇరు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఒకరిని ఒకరు కొట్టుకునే దాకా కూడా పరిస్థితి వెళ్లింది. చంద్రబాబు నుంచి గట్టి హామీ తీసుకున్న తర్వాతే… రవికుమార్ సీనియర్ అయిన బలరాంతో ఢీకొట్టేందుకే సిద్ధప‌డ్డార‌ని స‌మాచారం.

ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కమిటీ స‌మావేశంలో కరణం బ‌ల‌రామ్‌కు చంద్రబాబు గట్టిగానే వార్నింగు ఇచ్చినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… అద్దంకి నియోజకవర్గంపై ఆశలు వదులు కోవాలని చంద్రబాబు నేరుగా చెప్పారట. ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటికే ఆ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో వదిలేయాల్సిందేనని కూడా బలరాంకు ఆదేశాలు జారీ చేశారట. అంతే కాకుండా గొట్టిపాటితో వైరాన్ని తెంచుకోవాలని, కలిసి పనిచేయాలని కూడా చెప్పారట. పార్టీ ఆదేశాలను ధిక్కరించే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని కూడా కరణం ముఖం మీదే చెప్పేశారట.

పార్టీ సీనియర్ నేతగా ఉన్న త‌న‌కు ఎమ్మెల్సీగానో, లేక‌ దానికి తగ్గ ఏదైనా పదవి ఇస్తానని లేదా నియోజకవర్గాల పునర్విభజనలో అసెంబ్లీ సీట్లు పెరిగితే… త‌న‌యుడు కరణం వెంకటేశ్ కు మరో చోట ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చార‌ట‌. అధినేత తన ముఖం మీదే హెచ్చరికలు చేస్తూ… పదవుల కోసం వేచి చూడాలన్న కోణంలో మాట్లాడటంతో బలరాం ఇబ్బంది పడ్డారట. ఈ నేప‌థ్యంలో మ‌రి క‌ర‌ణం బ‌ల‌రాం ఏనిర్ణ‌యం తీసుకుంటారో వేచిచూడాల్సిందే!!

Continue Reading

More in Featured

 • Missing Indonesian was found dead inside a big snake

  By

  అతని పేరు అక్బర్ సాలుబిరో. ఇండోనేషియాలోని ఓ పల్లెటూరిలో నివసించేవాడు. అతను తవుడు నూనే వ్యాపరం చేసేవాడట. ఓరోజు అదే పని...

 • Get 60GB – 120GB free data with Jio Prime

  By

  జియో వెల్కమ్ ఆఫర్ కి రేపే చివరి తేది. రేపు అర్థరాత్రి, 11:59 నిమిషాలు దాటగానే, మీరు జియో సర్వీసులకి డబ్బులు...

 • NEWS

  Agri Gold Issue Leaves Pawan Kalyan Behind

  By

  ఆకులు కాలాక చేతులు ప‌ట్టుకుని ఏం లాభం..ఈ విష‌యం ఇప్పుడు జ‌నసేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు స‌రిగ్గా స‌రిపోతుంది. కొన్ని రోజులుగా అగ్రిగోల్డ్...

 • HEALTH TIPS

  Early morning skin care tips

  By

  ఆరోగ్యానికి సంబంధించిన మంచిపనులన్ని పొద్దున్నే మొదలుపెట్టాలని చెబుతారు డాక్టర్స్. ఎందుకంటే మన శరీరం మీద ధ్యాస పెట్టడానికి అదే మంచి సమయం....

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..