Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

కేసీఆర్‌కు రివ‌ర్స్‌లో చంద్ర‌బాబు-Chandrababu Reverse To Kcr

ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు త‌మ‌దైన పాల‌న‌తో ముందుకు దూసుకుపోతున్నారు. ఇందులో సీఎం కేసీఆర్‌ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుంటే.. త‌న ప‌థ‌కాల‌తో, హైటెక్ పాల‌న‌తో ఏపీని క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కిస్తున్నారు చంద్ర‌బాబు. అయితే పాల‌న‌లో కేసీఆర్‌ను చంద్ర‌బాబు ఫాలో అవుతున్నారనే విమ‌ర్శ‌లు వినిపించాయి, కానీ ఒక విష‌యంలో మాత్రం కేసీఆర్‌కు పూర్తి రివ‌ర్స్‌లో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

స‌చివాల‌యం.. రాష్ట్ర ప‌రిపాల‌నా యంత్రాంగం అంతా కొలువుదీరే ప్రాంతం! అయితే స‌చివాల‌యానికి రాక‌పోయినా సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్ర వ్య‌వ‌హారాల‌ను, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచే చ‌క్క‌బెట్టేస్తున్నారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం తెలంగాణ కేసీఆర్ కు భిన్నంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వెల‌గ‌పూడిలో స‌చివాల‌యంలో సీఎం బ్లాక్ ప్రారంభం కాన‌ప్పుడు విజ‌య‌వాడ‌లోని సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచే అన్నీ నిర్వ‌హించేవారు. కానీ స‌చివాల‌యంలో సీఎం బ్లాక్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి అస‌లు సీఎం క్యాంపు కార్యాలయం వైపు క‌న్నెత్తి చూడ‌ట‌మే మానేశారు. పాల‌న అంతా స‌చివాల‌యం నుంచే చ‌క్క‌బెడుతున్నారు.

క్యాంపు కార్యాల‌యం వైపు సీఎం వ‌చ్చి దాదాపు నెలరోజుల పైమాటే అయిందని అధికారులు చెబుతున్నారు. ముఖ్య‌మంత్రే రాకపోవడంతో మంత్రులు – ఎమ్మెల్యేలు కూడా ఇటు వైపు చూడడం మానేశారు. అయితే సీఎం క్యాంపు కార్యాలయానికి నేత‌లెవ‌రూ రాక‌పోయినా.. కార్యాలయానికి అదే గస్తీ.. అదే భద్రత కొనసాగుతోంది. సుమారు 60 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారు. ఇందులో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు అధికం. అయితే ఇక్కడ మాత్రం నెలల తరబడి ఉండిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పోలీసులు వాపోతున్నారు.

త‌మ కుటుంబ స‌భ్యులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వాపోతున్నారు. మ‌రోప‌క్క భ‌ద్ర‌తా స‌మ‌స్య‌ల‌తో క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద స్థానికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. సీఎం ఉన్న సమయంలో అయితే ఈ నిబంధనలు పాటించడం తప్పనిసరి కాని ఇపుడు తమను అనవసరంగా ఈ రూపంలో ఇరకాటం పాలు చేయడం ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Continue Reading

More in Telugu News

  • NEWS

    Sachiin Joshi opens up on Bandla Ganesh controversy

    By

    సంచలన నిర్మాత బండ్ల గణేష్ గురించి ఎప్పుడూ సంచలన వార్తలు వింటూనే ఉన్నాం మనం. బండ్ల ఇంత పెద్ద నిర్మాత అవడానికి...

  • GOSSIPS

    Sreemukhi lost that offer because of height and figure?

    By

    అనసూయ, రష్మీల తరువాత, మళ్ళీ అంతగా పాపులర్ అయిన కొత్తతరం యాంకర్ ఎవరు అంటే శ్రీముఖి అనే చెప్పాలి. ఈ 23...

  • HEALTH TIPS

    How should a pregnant women protect baby from disabilities

    By

    ప్రతీ ఏడాది వేలకొద్దీ కానుపుల్లో పిల్లలు ఊహించని విధంగా పుడుతున్నారు. అన్నిసార్లు జెనిటిక్ సమస్యలే ఉండవు, చాలావారకు బయట నుంచి తెచ్చుకున్న...

  • HEALTH TIPS

    How to increase semen volume

    By

    అంగస్తంభన లేమి, శీఘ్రస్కలనం .. వీటి తరువాత మగవారు సెక్స్ జీవితంలో ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య వీర్యం తక్కువగా రావడం....

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..