అప్పుడే ఎన్నికలా అని హాశ్చర్యపోకండి.సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు వద్ద స్పష్టమైన సమచారం ఉందట! ఇంకేం తెలుగు తమ్మళ్లూ సిద్ధంకండి.
విజయమో వీరస్వర్గమో తేల్చుకొనగ రారండి.అధికారం లో వచ్చి రెండున్నర ఏళ్లు కావస్తున్నా ఇంకా పాలన గాడిలో పడలేదన్న విమర్శ అటుంచి ఎవరు ఎక్కడ పోటీచేయాలో అన్న మల్లగుల్లాలు టీడీపీ గూటిలో ఇప్పటినుంచే మొదలు కావడం ఎంతైనా ఆలోచించదగ్గదే! ఇకపై ప్రతి రోజూ సాయంత్రం పార్టీకే తన సమయం కేటాయిస్తానని చెబుతున్న ఆయన , గెలుపే ధ్యేయంగా శ్రేణులను ఉరుకులెత్తించనున్నారట!
అధినాయకుడు ఓకే ఇక క్యాడర్ ఏమంటుందో?? ఏమౌతుందో? ఇప్పటికే వలస నేతల తలనొప్పులతో సతమతమవుతున్న సైకిల్ పార్టీ అప్పుడే కదనకుతూహలంతో ఒకింత అత్యుత్సాహంతో స్టేట్మెంట్లు పాస్ చేస్తుందన్నది ఓ విశ్లేషకుల వ్యాఖ్య.ఏదేమైనా బ్యాలెట్ బాటిల్‌కు ఇప్పటినుంచే అంటే రెండున్నరేళ్ల ముందుగానే టీడీపీ బాస్ సిద్ధం కానుండడం ఓ విధంగా విశేషమే.! మరి! పదవులు రాని నేతలు బాస్‌తో కలిసి పనిచేస్తారో లేదో .!