బాబు కొత్త మంత్రుల్లో వారిద్ద‌రే టాప్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేస్తూ ఆ ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తూ త‌న కేబినెట్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల‌ను అలెర్ట్ చేస్తున్నారు.ఈ క్ర‌మంలోనే 2019 ఎల‌క్ష‌న్ టీంగా కొత్త మంత్రుల‌కు చోటు ఇచ్చాడు.

 Chandrababu Naidu Survey Report On His Ministers-TeluguStop.com

ఈ మంత్రులు ప‌నితీరుపై ఆయ‌న తాజాగా చేసిన స‌ర్వేలో ఇద్ద‌రు మంత్రుల‌కు టాప్ ర్యాంకులు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.ఈ కొత్త మంత్రుల్లో వ్య‌వ‌సాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డికి టాప్ ర్యాంకు వ‌చ్చింద‌ట‌.

సోమిరెడ్డి శాఖా ప‌రంగాను, రాజ‌కీయ ప‌రంగాను దూసుకుపోతున్న‌ట్టు తేలింద‌ట‌.రాజ‌కీయంగా విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ఓ రేంజ్‌లో, పాయింట్ ప‌రంగా టార్గెట్ చేస్తోన్న సోమిరెడ్డి త‌న శాఖ‌లో ఎలాంటి రిమార్క్ లేకుండా చూసుకుంటున్నారు.

బాబు ఆయ‌న‌పై పెట్టుకున్న అంచ‌నాల‌ను ఆయ‌న చేరుకున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది.అందుకే బాబు ఆయ‌న‌కు కొత్త మంత్రుల్లో టాప్ ర్యాంక్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఇక చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌.తొలినాళ్ల‌లో త‌డ‌బ‌డినా కుదుట‌ప‌డ్డార‌ట‌.

లోకేశ్‌కు స్టార్టింగ్‌లో స‌రిగా మాట్లాడ‌డం కూడా రావ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఆయ‌న‌పై వ‌చ్చాయి.ఇప్పుడు ఈ మూడు నెల‌ల్లోనే లోకేశ్ ఏకంగా 30 కంపెనీలు తీసుకువ‌చ్చి, 3 వేల ఉద్యోగాలు ఇప్పించారు.

ఏకంగా 130 స‌మీక్ష‌లు చేసి ఓ రికార్డు కూడా సృష్టించారు.దీంతో లోకేశ్‌కు బాబు రెండో ర్యాంకు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఇక విద్యుత్ శాఖా మంత్రి క‌ళా వెంక‌ట్రావుకు జ‌స్ట్ ఓకే మార్కులు ప‌డిన‌ట్టు తెలుస్తోంది.ఆయ‌న త‌న శాఖ‌లో మ‌రీ దూసుకుపోక‌పోయినా వివాదాలు లేకుండా చూసుకుంటున్నారు.

సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు వైసీపీపై ఎదురుదాడితో బాబు వ‌ద్ద మంచి మార్కులు వేయించుకున్నారు.ఇక కార్మిక శాఖా మంత్రి పితానికి గుంటూరు జూట్ మిల్ కార్మికుల చ‌ర్చ‌ల అంశం ప్ల‌స్ అయ్యింది.

నక్కా ఆనంద్ బాబు ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలం సమస్యలు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలమయ్యారట‌.ఇక ఎక్సైజ్ మంత్రి జ‌వ‌హ‌ర్‌కు బీరు విష‌యంలో చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న‌కు చిన్న రిమార్క్‌గా మారాయి.

ఫిరాయింపు మంత్రుల్లో ఆదినారాయ‌ణ‌రెడ్డి అంచ‌నాలు అందుకోవ‌డం లేద‌ట‌.ఇక అమ‌ర్‌నాథ్ రెడ్డి ఓకే అంటున్నారు.

సుజ‌య్‌కృష్ణ శాఖా ప‌రంగాను జిల్లాలోను ఇప్ప‌ట‌కీ ప‌ట్టు సాధించ‌లేక‌పోయారు.ఇక రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోవడంతో భూమా అఖిల‌ప్రియకు యావ‌రేజ్ మార్కులే ప‌డ్డాయ‌ట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube