చంద్రబాబు మాస్టర్ ప్లాన్..అఖిలప్రియకు షాకే

చంద్రబాబు నాయుడికి ఎవరిని ఎక్కడ ఉంచాలో బాగా తెలుసు ఎన్నికల నేపధ్యంలో.తాను అవలంభించే సూత్రాలు మరే రాజకీయనాయకుడు చేయలేడు.

 Chandrababu Master Plan At Nandhyala-TeluguStop.com

మొన్న జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ గెలవడానికి కారణం “భూమానాగిరెడ్డి” మరణం తాలూకు సెంటిమెంట్.ఇది అందరికి తెలిసిన విషయమే.

ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాంధ్యలలో అఖిల ప్రియ ప్రభాల్యం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు.అందుకే వేగంగా పావులు కదుపుతూ.

అఖిల ప్రియని మంత్రి పదవి నుంచీ తప్పించే ప్రత్నం చేస్తున్నాడు అని టాక్.నంద్యాల ఉప ఎన్నికల్లో తన సర్వ శక్తులు ఒడ్డి.

టీడీపీ విజయానికి కృషి చేసిన ఆమెను.విధులు సక్రమంగా నిర్వహించట్లేదనే సాకుతో మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారట

భూమా నాగిరెడ్డి పార్టీలో చేరితో కేసులు ఉండవని మంత్రి పదవి ఇస్తామని ఆశచూపి సీఎం చంద్రబాబు టీడీపీలో చేర్చేసుకున్నారు.

తర్వాత నాగిరెడ్డి మరణించడం.ఏమాత్రం ప్రాధాన్యత లేని శాఖ అఖిల ప్రియకి ఇవ్వడం జరిగింది.

నంద్యాల ఉప ఎన్నికల భారాన్ని కూడా ఆమెపైనే వేసి.సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేసి విజయవంతమయ్యారు.

అయితే ఎన్నికల సమయంలో తల్లీ తండ్రి లేని పిల్లపై మీ ప్రతాపమా అంటూ చంద్రబాబు చేసిన ప్రసంగం జనాలకి బాగా నాటూకు పోయింది అలా మాట్లాడిన చంద్రబాబు మరి ఇప్పుడు చంద్రబాబు అఖిల ప్రియకి అన్యాయం చేయడానికి ఎలా పూనుకుంటున్నాడు అని అఖిల ప్రియ వర్గం గుర్రుగా ఉంది

ఇది ఇలా ఉంటే కొంత కాలంగా అఖిల ప్రియ.బాధ్యతలను సరిగా పట్టించుకోవట్లేదనే వాదన వినిపిస్తోంది తన కార్యాలయంలో పెద్ద మొత్తంలో ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయట వీటిని మంత్రిగారు ఎమాత్రం పట్టించుకోవడం లేదట.

అంతేకాదు సీఎం నిర్వహించే సమావేశాలకు అప్పుడప్పుడు హాజరు అవుతున్నారు తప్ప ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని టాక్.జిల్లా సీనియర్ నాయకులతో ముభావంగా ఉండటం.

కొంతమందితో గొడవలు పెట్టుకోవడం లాంటివి చేయడం.అస్సలు సీనియర్స్ని గౌరవించట్లేదని .ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి.ముఖ్యమంత్రి చేయించే సర్వేలలో ఆమెకు ఏమాత్రం అనుకూలంగా లేవట.

దాంతో మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు సైతం మొదలయ్యాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.దీనిపై భూమా వర్గీయులు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

పార్టీలో చేరేముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ఆ అసంతృప్తితోనే అఖిల కు బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేకపోతోందని చెబుతున్నారు.అఖిలప్రియ విషయంలో అన్యాయం జరిగితే చూస్తూ ఉరుకోమని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube