చంద్ర‌బాబుకు భ‌యం ఎందుకో..!

తెలంగాణ ఉద్య‌మం ఎందుకు జ‌రిగిందో ? ఎలా జ‌రిగిందో ? ఏపీ సీఎం చంద్ర‌బాబుకు తెలియంది కాదు.ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌త్యేక రాయ‌ల సీమ ఉద్య‌మం త‌లెత్త‌కుండా భారీ ఎత్తున జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌నే వార్త‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

 Chandrababu Fear About Rayalaseema-TeluguStop.com

ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు అటు ప్ర‌భుత్వం, ఇటు పార్టీ ప‌రంగా కూడా తీసుకుంటున్న చ‌ర్య‌లు ఈ వార్త‌ల‌కు బ‌లాన్ని చేకూరుస్తున్నాయి.అస‌లేం జ‌రిగిందో? ఏం జ‌రుగుతోందో ? చూద్దాం.

13 జిల్లాల ఏపీలో ఇప్పుడు విజ‌య‌వాడ‌, గుంటూరు, విశాఖ వంటి కీల‌క ప‌ట్ట‌ణాల‌పైనే సీఎం చంద్ర‌బాబు దృష్టి పెట్టారు.విజ‌య‌వాడ‌, గుంటూరుల‌ను రాజ‌ధాని ప్రాంతాలుగా ప్ర‌క‌టించి భారీ ఎత్తున అభివృద్ది చేస్తున్నారు.

ఇక‌, విశాఖ‌ను ఆర్థిక రాజ‌ధానిని చేసేశారు.ఏ ఫైనాన్షియ‌ల్ మీటింగ్ జ‌ర‌గాల‌న్నా.

కేరాఫ్ విశాఖే.అలాంటి ప‌రిస్థితిలో స‌హ‌జంగానే త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని ఇప్ప‌టికే మొత్తుకుంటున్న రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు తాజా అభివృద్ధితో మ‌రింత ర‌గిలిపోతున్నారు.

ఈ విష‌యం అలా అలా చంద్ర‌బాబు చెవిలో ప‌డింది.మొన్నామ‌ధ్య జ‌రిగిన ఓ స‌భ‌లో టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డినేరుగా విజ‌య‌వాడ అభివృద్ధి అయిపోతోంద‌ని అయితే, దీని వ‌ల్ల త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని, త‌మ‌కు సీమ‌ను డెవ‌ల‌ప్ చేయాల‌ని బ‌హిరంగంగా సీఎంని కోరాడు.

దీనికితోడు ఇంటిలిజెన్స్ రిపోర్ట్ కూడా సీమ‌లో టీడీపీ ప‌రిస్థితి బాగోలేద‌నే వ‌చ్చింద‌ట‌.అక్క‌డ అభివృద్ధి చేయ‌క‌పోతే, 2019లో ఓటు బ్యాంకు తిర‌గ‌బ‌డుతుంద‌ని రిపోర్ట్ అందిందిట సీఎంకి .అంతేకాదు, ప‌రిస్థితి ఇలానే సాగితే.సీమ ప్ర‌త్యేక ఉద్య‌మం మొద‌లై ఉదృత‌మైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని నివేదిక పేర్కొంద‌ట‌.

దీంతో హుటా హుటినస్పందించిన బాబు.ఆయా జిల్లాల‌కు ప్ర‌త్యేకంగా ఇంచార్జుల‌ను నియ‌మించేశారు.

అచ్చెన్నాయుడును చిత్తూరుకు, కాల్వ శ్రీనివాసులును కర్నూలుకు, దేవినేని ఉమామహేశ్వరరావును అనంతపురానికి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కడప జిల్లాకు ఇన్ ఛార్జులుగా నియమించారు.ఎప్పటికప్పుడు వారి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు.

రాయలసీమలో మరో ప్రత్యేక ఉద్యమం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.అందుకోసమే రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారు.

మ‌రి భ‌విష్య‌త్‌లో ఇంకెలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.ఇప్ప‌టికైతే.

బాబు ప్ర‌త్యేక సీ మ ఉద్య‌మానికి భ‌య‌ప‌డుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube