అద్దె ఇంట్లో చంద్రబాబు కుటుంబం

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి.ఆయన కుటుంబానికి అద్దె ఇంట్లో ఉండాల్సిన గతేమిటి అనుకుంటున్నారా? బాడుగ ఇళ్లలో సామాన్యులు, కొద్ది ఆదాయం ఉన్నవారు ఉంటారు.బాబు వంటి బడా రాజకీయ నాయకుడు, కోట్లకు పడగలెత్తిన వ్యక్తి ఫ్యామిలీ అద్దె ఇంట్లో ఎందుకుంటుంది? కాని ఏడాదో, ఏడాదిన్నరో ఉండాలి.తప్పదు.ఎందుకంటే…బాబు హైదరాబాదులో ప్రస్తుతం ఉన్న సొంత ఇంటిని కూలగొట్టి అదే స్థానంలో కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభించబోతున్నాడు.ఇప్పుడున్న మూడు బెడ్‌ రూముల ఇల్లు సరిపోవడంలేదట…! చాలా ఇబ్బంది పడుతున్నారట…! అందుకే పెద్ద ఇల్లు కట్టాలని నిర్ణయించాడు.

 Chandrababu Family Moves Into Rented House-TeluguStop.com

దీంతో జూబ్లీ హిల్‌్సలో ఓ బిల్డర్‌కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్నారు.రాష్ర్టం విడిపోయి ఆయన ఏపీకి ముఖ్యమంత్రి అయినా ఆయన కుటుంబం మాత్రం హైదరాబాదును వదిలిపెట్టదు.

ముప్పయ్‌ ఏళ్లకు పైగా ఇక్కడే ఉంది.ఇక్కడే ఆస్తులు,వ్యాపారాలు ఉన్నాయి.

వియ్యంకుడు కమ్‌ బావమరిది బాలకృష్ణ హైదరాబాదులోనే ఉన్నాడు.పరిపాలన కూడా ఇక్కడి నుంచే సాగుతోంది.

ఇప్పటికిప్పుడు ఏపీకి తరలిపోలేడు.అక్కడ రాజధాని నిర్మాణానికి ఇంకా చాలా ఏళ్లు పడుతుంది.

హైదరాబాదును అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకుంటున్న బాబుకు ఈ నగరం మీద ప్రేమ ఎక్కువ కదా…!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube