లోకేష్ మాట‌: బాబు కేబినెట్ నుంచి ఆ మంత్రి అవుట్‌

ఏపీలో చంద్ర‌బాబు కేబినెట్‌లో చాలా మంది మంత్రుల ప‌నితీరు సంతృప్తిక‌రంగా లేద‌న్న టాక్ ఎప్ప‌టి నుంచో ఉంది.చాలా జిల్లాల్లో మంత్రులు భారీ ఎత్తున అవినీతికి ఆస్కారం ఇవ్వ‌డ‌మో లేదో త‌ర‌చూ ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీల్లో చిక్కుకుంటుడ‌డ‌మో చేస్తున్నారు.

 Threat To Ravela Kishore Babu Minister Post-TeluguStop.com

ఈ జాబితాలో గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి రావెల కిషోర్‌బాబు పేరు సైతం ఉంది.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందే పార్టీలో చేరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల ద‌ళిత క్రైస్త‌వుల కోటాలో చాలా సులువుగానే బాబు కేబినెట్‌లో చోటు ద‌క్కించుకున్నారు.

మంత్రిగా ఎన్నికైన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు.ముందుగా బీజేపీతో పొత్తు విష‌యంలో కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు చేసి చంద్ర‌బ‌బుతో తిట్లు తిన్న ఆయ‌న త‌ర్వాత త‌న ఇద్ద‌రు కుమారుల వ్య‌వ‌హారంతో మ‌రోసారి వార్త‌ల్లోకెక్కారు.

ఇక తాను ప్రాథినిత్యం వ‌హిస్తోన్న ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం, జ‌డ్పీ చైర్మ‌న్ షేక్ జానీమూన్‌తో వివాదం, తాను ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న ప్ర‌కాశం జిల్లాలో సైతం వివాదాల్లో చిక్కుకోవ‌డంతో రావెల అంటే అంద‌రూ విసిగిపోయి ఉన్నారు.రావెల‌పై ఇప్ప‌టికే బాబుకు చాలా ఫిర్యాదులు సైతం వెళ్లాయి.

మంత్రివ‌ర్గ‌ ప్ర‌క్షాళ‌న ఎప్పుడు జ‌రిగినా కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యే మంత్రుల జాబితాలో రావెల పేరు కచ్చితంగా ఉంటుందని కొందరు ముఖ్యనేతలు ఓపెన్ గానే చెబుతున్నారు.ఈ క్ర‌మంలోనే టీడీపీ యువ‌నేత నారా లోకేష్ తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న బ‌ట్టి చూస్తే రావెల కిషోర్ బాబు మంత్రి ప‌ద‌వి ఊడ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

గుంటూరు జిల్లాలోని పార్టీ కార్యకర్తలతో సమావేశంలో రావెల నియోజ‌క‌వ‌ర్గ‌మైన ప్ర‌త్తిపాడుకు చెందిన ప‌లువురు టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు క‌లిసి మంత్రి త‌మ‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని లోకేష్‌కు ఫిర్యాదు చేశారు.వారి ఆవేద‌న అర్థం చేసుకున్న లోకేష్‌.

మ‌రో 15 రోజుల్లో రావెల‌పై మీరు ఎవ్వ‌రూ ఊహించ‌ని చ‌ర్య‌లు ఉంటాయ‌ని చెప్పార‌ట‌.లోకేష్ మాట‌ల‌ను బ‌ట్టి రావెల బాబు కేబినెట్ నుంచి అవుట్ అవ్వ‌డం దాదాపు క‌న్‌ఫార్మ్ అవ్వ‌డం ఖాయమ‌న్న టాక్ వ‌చ్చేసింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube