Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

బీజేపీకి యాంటీగా ఇద్ద‌రు చంద్రుళ్లు-Chandrababu And Kcr Starts Operation BJP

రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల కోసం బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల‌ను బాగా మ‌చ్చిక చేసుకుంది. ఇప్పుడు వీరితో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అవ‌స‌రం లేదు. 2019 ఎన్నిక‌ల్లో పొత్తులు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం బీజేపీకి వ‌స్తే త‌ప్ప అప్ప‌టి వ‌ర‌కు టీడీపీ, టీఆర్ఎస్‌ల‌ను మోడీ, అమిత్ షాలు చాలా లైట్ తీస్కోవ‌చ్చు. ఇక విడిపోయిన త‌మ రాష్ట్రాల‌కు కేంద్రం నుంచి ఎన్నో నిధులు వ‌స్తాయ‌ని నిన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు, కేసీఆర్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.

మిగిలిన అభివృద్ధి ప‌నుల సంగతి ఎలా ఉన్నా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి రావాలంటే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో అద‌న్నా కేంద్రం చేస్తుంద‌ని వీరు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రుగుతుంద‌న్న ఆశ‌తో వీరు ఇత‌ర పార్టీల నుంచి భారీగా ఎమ్మెల్యేల‌ను లాగేసుకున్నారు. ఇప్పుడు వీరితో పాటు సొంత పార్టీ నేత‌ల‌కు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు స‌ర్దుబాటు చేయడం కేసీఆర్‌, బాబుకు క‌త్తిమీద సామే.

Continue Reading
More Posts
To Top