చంద్ర‌బాబు కొత్త రూల్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్పుడు ప్ర‌భుత్వ ప‌రిపాల‌నలో సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.అధికారుల వినియోగం, నిధుల ఖ‌ర్చులో కోత వంటి వాటిపై ఆయ‌న దృష్టి సారించిన‌ట్టు తెలిసింది.

 Chandra Babu’s New Rule-TeluguStop.com

అంతే, ఒక మంత్రి త్వ‌శాఖ ప‌రిధిలో ఇద్ద‌రిద్ద‌రు చొప్పున ఉన్న ఐఏఎస్ అధికారుల‌ను త‌గ్గించి.ఉన్నవారిలో దీ బెస్ట్‌కి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంపై సీఎం దృష్టి పెట్టారు.

ఫ‌లితంగా ఒక మంత్రిత్వ శాఖ నుంచి రిలీవ్ అయిన ఐఏఎస్‌కి మ‌రో బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కూడా సీఎం యోచిస్తున్నారు.దీనివ‌ల్ల ఐఏఎస్‌ల కొర‌త త‌గ్గ‌డంతోపాటు.

పార‌ద‌ర్శ‌క సేవ‌లు అందుతాయ‌ని సీఎం అనుకుంటున్న‌ట్టు తెలిసింది.

ఈ నేప‌థ్యంలో మంత్రి గంటా శ్రీనివాస‌రావు శాఖ‌పై చంద్ర‌బాబు దృష్టిసారించారు.

విద్యాశాఖలోని ప్రాధమిక విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖలకు ఇద్దరు ఐఎఎస్‌ అధికారులున్నారు.అయితే, దీనికి మంత్రి మాత్రం ఒక్క గంటా శ్రీనివాస‌రావు మాత్ర‌మే ఉన్నారు.

ఈ నేపథ్యంలో రెండు శాఖలకు ఒకే ఐఎఎస్‌ అధికారిని నియమించారు.అంటే, ఒక శాఖ‌కు ఒక మంత్రి, ఒక ఐఏఎస్ అధికారి ఉండాల‌ని ఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ప్రాధమిక, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలకు ఆధిత్యనాథ్‌దాస్‌ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఈ శాఖలన్నింటికి ‘గంటా శ్రీనివాసరావు’ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

ఈ విధమైన మార్పులు మిగతా శాఖలకు కూడా చేయాలని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

ప్రస్తుతం పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖలకు ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అదే విధంగా మంత్రులు ఇద్దరు ఉన్నారు.పంచాయితీరాజ్‌కు ‘అయన్నపాత్రుడు’, గ్రామీణాభివృద్ధికి ‘మృణాళిని’ మంత్రిగా ఉండగా, జవహర్‌రెడ్డి పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శిగా గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శిగా ‘దినేష్‌కుమార్‌’ ఉన్నారు.

ఈ రెండు శాఖలకు కలిపి ఒక సీనియర్‌ ఐఎఎస్‌నునియమించడంతో పాటు ఒకే మంత్రి పరిధికి వీటిని తీసుకురానున్నారు.

ఇలా మొత్తంగా రాష్ట్రంలోని అన్ని శాఖ‌ల్లోనూ భారీ ఎత్తున మార్పులు చేయాల‌ని చంద్ర‌బాబు డిసైడ్ అయ్యారు.

ఇక్క‌డ ఆశ్చ‌ర్యం ఏంటంటే.ఈ ఐడియా వాస్త‌వానికి చంద్ర‌బాబుదికాదు! విద్యాశాఖ పరిధిలో ఉన్న విభాగాలన్నింటికీ ఒకే అధికారిని నియమించాలని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ‘ఆధిత్య నాథ్‌దాస్‌’ చేసిన సూచనలను ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ అంగీకరించి కొత్త రూల్స్‌కి తెర‌దీశార‌ని తెలుస్తోంది.

మొత్తానికి రాష్ట్రంలో అప్ర‌క‌టిత పాల‌నా సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేస్తున్నార‌ని అనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube