షార్ట్ ఫిలిమ్స్ రంగంలో ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది చాందినీ చౌదరి.అచ్చు మన పక్కింటి అమ్మాయిలా ఉంటుంది.
అందుకే చాందినికి మంచి ఫాలొయింగ్ ఏర్పడింది యూత్ లో.అక్కడినుంచి వెండితెరను టార్గెట్ చేసిన చాందినీ ఘోరంగా విఫలమైంది.
మొదటిచిత్రం కేటుగాడు చేదు ఫలితాన్ని మిగల్చగా, రెండొవచిత్రం కుందనపు బొమ్మ ఇంకా విడుదలకు నోచుకోలేదు.చాందిని చేతిలో హీరోయిన్ గా పెద్ద ప్రాజెక్టులు కూడా లేవు.
ఇక చాందినీ చేతిలో ఉన్న ఒకే ఒక్క మంచి ఆఫర్ బ్రహ్మోత్సవం.
ఈ చిత్రంలో చాందినీ కథానాయిక మాత్రం కాదు.
ఒక ప్రత్యేక పాత్రలో మెరువనుంది చాందినీ.చాందినీ మహేష్ కి ఏమవుతుంది, మహేష్ తో కలిసి ఎందుకు చిందులేసింది, తన పాత్ర నిడివి ఎంతసేపు అనేది మాత్రం తెలియదు.
ఏది ఏమైనా, చాందినీ లాంటి తెలుగందానికి ఈ చిత్రంతోనైనా మంచి గుర్తింపు రావాలని ఆశిద్దాం.