Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

అంటితో సెక్స్ సీన్ వద్దు అంటున్న సెన్సార్ -Censor Objects “sex With Aunty” In Babu Baga Busy

హిందీలో వచ్చిన హంటర్ అనే సినిమా ట్రైలర్ తోనే ప్రకంపనలు సృష్టించింది. ఇందులో హీరోది ఒక సెక్స్ అడిక్ట్ పాత్ర. చిన్నప్పట్టి నుంచి సెక్స్ మీద విపరీతమైన ఆకర్షణ పెంచుకుంటూ ఉంటాడు. ఇలాంటి కథని తెలుగులో తీసుకురావాలనుకోవడం పెద్ద సాహసం. నీట్ అండ్ క్లీన్ క్లాస్ సినిమాలు శ్రీనివాస్ అవసరాలకి ఒకేరకం సినిమాలు చేసి చేసి బోర్ కొట్టిందేమో .. అందుకే తన కెరీర్ లో కాసింత మసాలా దట్టించేందుకు ఆ సాహాసం చేసాడు. హంటర్ ని “బాబు బాగా బీజీ” గా రిమేక్ చేసాడు.

ఊహించినట్టుగానే ఈ సినిమాకి సెన్సార్ బోర్డు సమస్యలు సృష్టిస్తోంది. ఈ సినిమాలో హీరో పెళ్ళి అయిన ఒక అంటితో కూడా సెక్సువల్ రిలేషన్ షిప్ పెట్టుకుంటాడు. అందులో భాగంగానే శ్రీనివాస్ అవసరాల, ఆ అంటి పాత్రని పోషించిన తెలుగమ్మాయి సుప్రియ ఐసోలా ఒక ఘాటు సన్నివేశంలో నటించారు. అది అలాంటి ఇలాంటి ఘాటు సన్నివేశం కాదు … తెలుగు సినిమాలో ఇప్పటివరకు చూడని సన్నివేశం. ఇప్పుడు ఆ సన్నివేశం మీద సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

అంటితో హీరో సెక్సువల్ రిలేషన్ షిప్ పెట్టుకోవడం సెన్సార్ వారికి నచ్చలేదట. దాంతో సెన్సార్ ఆగిపోయింది. ఆ సన్నివేశం ఉంచాలా, తీసేయాలా అని తెగ ఆలోచిస్తున్నాడట అవసరాల. కథపరంగా చూస్తే అది కీలక సన్నివేశం .. ఎదో కావాలని ఇరికించింది కాదు. ఇక్కడ సెన్సార్ మాత్రం ఒప్పుకోవడం లేదు. అందుకే కాస్తంత టైం అడిగి, ఏప్రిల్ లో రావాల్సిన సినిమాని మే 5వ తేదికి వాయిదా వేసుకున్నాడు. మరి మేలో ఈ సినిమా ఆ సన్నివేశంతో సహా విడుదల అవుతుందో లేక సెన్సార్ ఆంక్షలకు అవసరాల తలోగ్గుతాడో చూడాలి.

Continue Reading
More Posts
To Top