సినిమా ఎవరిని ఎలా వాడుకోవాలో తెలిస్తే మనల్ని ఎవరు ఆపలేరు .ఈ విషయాన్ని బాగా వంటబట్టించుకున్నట్టుంది కేథరిన్ థ్రేసా .
అమ్మడు తెలుగులో కెరీర్ ను మొదలుపెట్టినా అడపాదడపా కొన్ని సినిమాలు తప్ప ఎక్కడా సాఫీగా సాగలేదు.అందుకే కోలివుడ్ మీద పడింది ఇప్పుడు.
కోలివుడ్ లో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న వార్త ఏంటంటే .కేథరిన్ ఒక స్టార్ నిర్మాతతో ప్రేమాయణం సాగిస్తోందట.ఆ నిర్మాత వలనే ఆయన కేథరిన్ కు ఆఫర్లు వస్తున్నాయని, కేథరిన్ చేస్తున్న నాలుగు సినిమాల్లో మూడింటికి ఆ నిర్మాతే డబ్బులు పెడుతున్నాడని తమిళ తంబీలు గుసగుసలాడుకుంటున్నారు.ఈ జంట పెళ్లి పీటలు ఎక్కినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని కోలివుడ్ కోడై కూస్తోంది.
ఇక్కడితో ఆగకుండా ఈ మధ్యే ఆ జంట ఒక ఫారిన్ టూర్ కి కుడా వెళ్లి వచ్చారట.కేథరిన్ కి మరిన్ని ప్రాజెక్ట్స్ దక్కేలా ఆ నిర్మాత తన శక్తంతా ధారబోస్తున్నాడట .ఎంతైనా లోకజ్ఞానం బాగా తెలిసిన అమ్మాయిలా ఉంది మన కేథరిన్.ఏమంటారు ?
.