కేసీఆర్ కేబినెట్‌లో కుల‌చిచ్చు

తెలంగాణ కేబినెట్‌లో క్యాస్ట్ ఫీలింగ్ రేగిందా ? కేసీఆర్ కేబినెట్‌లో రెడ్డి సామాజిక‌వ‌ర్గం మంత్రుల‌కు, ఇత‌ర కులాల మంత్రుల‌కు బాగా గ్యాప్ పెరిగిందా ? ఇత‌ర కులాల పోస్టులు మార‌తాయ‌ని జ‌రుగుతోన్న ప్రచారం వెన‌క రెడ్డి సామాజిక‌వ‌ర్గం మంత్రుల వ్యూహం ఉందా ? అంటే టీ పాలిటిక్స్‌లో అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది.సీఎం కేసీఆర్ త్వ‌ర‌లోనే త‌న కేబినెట్‌ణ ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

 Caste Feeling In Kcr Cabinet-TeluguStop.com

ఈ ప్ర‌క్షాళ‌న‌లో బీసీ వ‌ర్గానికి చెందిన జోగు రామ‌న్న‌, ఎస్టీ వ‌ర్గానికి చెందిన అజ్మీరా చందూలాల్‌ను త‌ప్పిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

దీంతో వీరిద్ద‌రు ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద‌ర్‌తో పాటు మ‌రో మంత్రి, కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్‌ను క‌లిసి త‌మ‌పై ఈ ప్ర‌చారం ఏంట‌ని మొర‌పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది.

త‌మ‌పై ఈ ప్ర‌చారం వెన‌క కొంద‌రు రెడ్డి సామాజిక‌వ‌ర్గం మంత్రులు ఉన్నార‌ని కూడా వారు కేటీఆర్‌కు కంప్లైంట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.వాస్త‌వానికి ఊస్టింగ్ లిస్టులో రెడ్డి వ‌ర్గానికి చెందిన మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి – నాయిని న‌ర్సింహారెడ్డి – ల‌క్ష్మారెడ్డి – మ‌హేంద‌ర్‌రెడ్డి పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు వీళ్ల పేర్లు తెర‌వెన‌క్కు వెళ్లిపోగా జోగు రామ‌న్న‌, చందూలాల్ పేర్లు మాత్ర‌మే వార్త‌ల్లో ఉన్నాయి.ఈ ప్ర‌చారం వెన‌క రెడ్డి వ‌ర్గం మంత్రులు ఉన్నార‌ని…వారిపై మీడియాలో వ్య‌తిరేక వార్త‌లు రాకుండా వారే ఈ ప్ర‌చారం చేయిస్తున్నార‌ని జోగు రామ‌న్న‌, చందూలాల్ అనుమానిస్తున్నార‌ట‌.

ఊస్టింగ్ లిస్టులో కేవ‌లం బ‌ల‌హీన‌వ‌ర్గాల పేర్ల‌ను పెట్టి ఈ ర‌క‌మైన ప్ర‌చారం చేయ‌డం స‌రికాద‌ని…ఇలా చేస్తే ఆయా వ‌ర్గాల్లో పార్టీకి ఉన్న ఇమేజ్ పోతుంద‌ని వారిద్ద‌రు కేటీఆర్‌కు చెప్పార‌ట‌.కేటీఆర్ కూడా ఈ ప్ర‌చారం న‌మ్మొద్ద‌ని వారికి సూచించిన‌ట్టు తెలుస్తోంది.

కేబినెట్‌లో కుల‌చిచ్చు వ్య‌వ‌హారంపై చివ‌ర‌కు సీఎం కేసీఆర్ వ‌ద్ద‌కు కూడా వెళ్లింద‌ట‌.ఈ విష‌యంపై కేసీఆర్ స్పందిస్తూ కులాల ప‌రంగా ప్ర‌క్షాళ‌న ఉండ‌ద‌ని, ప‌నితీరు స‌రిగా లేని మంత్రులు ఎవ‌రైనా వారిని త‌ప్పిస్తాన‌ని ఆయ‌న హెచ్చ‌రిక‌లు జారీ చేశార‌ట‌.

సో కేసీఆర్ వార్నింగ్‌ను బట్టి చూస్తుంటే రెడ్డి వ‌ర్గంలో పనితీరు స‌రిగా లేని వారికి కూడా నిర్దాక్షిణ్యంగా త‌ప్పిస్తార‌ని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube