కిడ్నాప్ కేసులో విద్యాబాలన్..?

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఓ కిడ్నాప్ మర్డర్ కేసులో ఇరుక్కుందా అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు.అంతేకాదు ఈ కేసుకి సంబందించి ఆమె పరారీలో ఉండటంతో ఆమె గురించి వాంటెడ్ పోస్టర్ కూడా వేశారు.

 Case Filed On Vidya Balan For Kidnap-TeluguStop.com

ఏంటి ఇదంతా నిజమేనా అంటే అవును నిజమే కాని రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.కహాని టీం మరోసారి విద్యాతో మరో ప్రయోగానికి సిద్ధమైంది.గర్భిణితో తప్పిపోయిన భర్తని వెతకే క్రమంతో తీసిన కహాని ఎంతటి సంచలనా విజయం అందుకుందో తెలిసిందే.ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు సుజయ్ ఘోష్ డైరక్షన్లోనే కహాని-2 తెరకెక్కుతుంది.

అందులో కిడ్నాపర్ గా విద్యా నటిస్తుంది.దానికి సంబందించిన పోస్టర్ ను తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ గా పెట్టి సినిమా ప్రమోట్ చేస్తుంది విద్యాబాలన్.

బాలీవుడ్ లో సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విద్యాబాలన్ కు ఇలాంటి సినిమాలు తీయడం మాములే.తనకంటూ ఓ ప్రత్యేకమైనా క్రేజ్ ఏర్పరచుకున్న విద్యా ఈ కహాని-2తో ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

పెళ్లి తర్వాత కాస్త స్లో అయినట్టు కనిపించిన విద్యా బాలన్ ఇక నుండి వరుస సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తుందట.ప్రస్తుతం కహాని-2 పోస్టర్ మాత్రం ప్రేక్షకులను ఓ రేంజ్లో ఆకట్టుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube