రాజధాని పై ఓవర్ చేస్తున్నారా??

రాబోయే కాలానికి కాబోయే సింగపూర్ ‘తుళ్ళూరు’ అని ప్రభుత్వం అతి చేస్తుందా.హడావిడి తప్పా.

 Capital City Is At High Expectations-TeluguStop.com

ఇప్పటివరకూ చేసింది ఏమీ లేదా.అసలు ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం చూస్తే.

తుళ్ళూరు బలమైన రాజధానిగా అవతరించడానికి ఎంత టైమ్ పడుతుంది? ఇలా ఎన్నో విషయాలు.అనేక అనుమానాలు తుళ్ళూరు వాసులనే కాదు…సీమాంధ్ర ప్రజలను సైరం ఇబ్బందుల్లో నెడుతున్నాయి…ప్రభుత్వం వైపు నుంచి చూస్తే.

తుళ్లూరు రాజధాని అయితే భవిష్యత్ లో 80లక్షల మంది దాకా అక్కడికి వస్తారని, హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందుతుందని ఆలోచనలతో అన్ని పనులూ పక్కన పెట్టి కేవలం రాజధాని నిర్మాణం విషయంలోనే తలమునకలై ఉంది.అయితే ఇది నీజాగానే ఓవర్ యాక్షన్.

హైదరాబాద్ కు తుళ్లూర్ కు సంబంధం లేదు…ఎందుకంటే హైదరాబాద్ కు వందలఏళ్ళ చరిత్ర వుంది.చారిత్రాత్మక నేపథ్యముంది.

నిజాంలకాలం నుండి హైదరాబాద్ ఓ వెలుగు వెలిగింది.ఏపికి రాజధాని అయ్యాక శరవేగంగా అభివృద్ధి చెందింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల నుండి ప్రజలు ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా అక్కడ స్థిరపడ్డారు.అందరూ పెట్టుబడులు పెట్టారు.

కాబట్టే హైదరాబాద్ ఈరోజు అంతర్జాతీయ నగరం స్థాయికి ఎదిగింది.అయితే తుళ్లూర్ పరిస్థితి వేరు…రాష్ట్రంలో ప్రజలందరూ అక్కడకు వెళ్ళి స్థిరపడే అవకాశం ఎక్కడ లేదు.

అంతేకాకుండా ఆ ప్రాంతానికి హైదరాబాద్ లో ఒక వెలుగు రావాలంటే కనీసం 100ఏళ్లు పట్టడం ఖాయం అనే చెప్పాలి.మరి ఇవన్ని చూసి కూడా సీమాంధ్ర సింగపూర్ అవుతుంది అని నమ్మితే మాత్రం ఒకింత హాస్యాస్పదం అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube