Connect with us

మీ మిత్రులకు షేర్ చేయగలరు.

Featured

అరుదైన పాము విషంతో క్యాన్సర్ కి మందు-Cancer Treatment With Rare Snake Venom

ప్రతీ పాము విషం ప్రాణాలే తీయదు. కొన్ని సర్పాల విషం మనిషి ప్రాణాలని కాపాడటానికి కూడా పనికొస్తుంది. అలాంటి సర్పమే బ్లూ కోరల్ స్నేక్. ఈ సర్పాలు మలేసియా, ఇండోనేషియా, సింగపూర్ మరియు థాయ్ లాండ్ అడవుల్లో దొరుకుతాయి. వీటి విషం ద్వారా కొన్ని వ్యాధులను, నొప్పులను నయం చేసే పేయిన్ కిల్లర్స్ ని తయారుచేయవచ్చునట.

యూనివర్సిటి ఆఫ్ క్వీన్స్ లాండ్ స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ లో పనిచేసే ప్రొఫెసర్‌ బ్రయన్ ఫ్రై గత కొన్నిళ్ళుగా చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఈ పాము విషం ద్వారా పేయిన్ కిల్లర్స్ ని తయారుచేయవచ్చు. అంతేకాదు, దీని ద్వారా రూపొందించే మెడికేషన్ క్యాన్సర్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధిని కూడా కంట్రోల్ చేస్తుందట. కండరాలు చీలిపోయిన, మైగ్రేన్ లాంటి భయానక తలనొప్పి సమస్య ఉన్నా, ఈ పాము విషంతో చేసే మందులు పనిచేస్తాయని చెబుతున్నారు రిసెర్చి మీద పని చేసిన డాక్టర్లు.

గత 15 ఏళ్ళుగా కొనసాగిస్తున్న ఈ పరిశోధన కోసం రెండు బ్లూ కోరల్ పాములను తీసుకోని, వాటిని చంపకుండా, వాటి విషాన్ని సేకరిస్తూ వచ్చారట. ఆ విషంతో చాలారకాల పరిశోధనలు చేస్తే, ఔషధంలా పనిచేసే లక్షణాలు చాలా సడెన్ గా తెలిసివచ్చాయని ప్రొఫేసర్ చెప్పారు.

అలాగే ఈ పాములు అంతరించిపోతున్నాయని, ఇప్పటికే చాలా అరుదుగా దొరికే ఈ సర్పాలు, రానున్న కాలంలో మరింతగా కనుమరుగవుతాయని, అలా జరగడానికి అడవులని నాశనం చేసే మనుషులే కారణం అని ప్రొఫేసర్ బ్రయన్ ఫ్రై ఆవేదన వ్యక్తం చేశారు.

Continue Reading

More in Featured

 • HEALTH

  Benefits that come with regular intake of Coconut Water

  By

  కొబ్బరినీళ్ళు కాలంతో సంబంధం లేకుండా బయట రోడ్డు మీదే చవకగా దొరుకుతాయి. అలాంటి మినరల్స్ కలిగిన నేచురల్ డ్రింక్ మనకి అందుబాటులో...

 • HEALTH

  Vegetables to be avoided during weight loss

  By

  బరువు తగ్గాలంటే తినే మోతాదుని తగ్గించడం, సరైన వ్యాయడం చేయడం మాత్రమే సరిపోదు. నిజానికి ఎంత తింటున్నాం అనే దాని కన్నా,...

 • HEALTH

  A special tea to control high blood pressure

  By

  హైబీపి చాలా కామన్ గా మనం చూసే సమస్యే. మన ఇంట్లో తాతయ్య, బామ్మలకు ఉండే ప్రధాన సమస్యల్లో ఇది కూడా...

 • HEALTH

  Avoid all these foods Early in the morning

  By

  కొన్ని గంటలు ఎలాంటి ఆహారం తీసుకోకుండా, ఉదయాన్నే కడుపుకి పనిచేబుతాం కాబట్టి, బ్రేక్ ఫాస్ట్ ని సరిగా ప్లాన్ చేసుకోవాలి. ఉదయాన్నే...

To Top
Loading..