చనిపోయేలోపు ‘గబ్బర్‌సింగ్‌`2’..!

టాలీవుడ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌`2’ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ఈ సంఘటన చూస్తే అర్థం అవుతోంది.పవన్‌ కళ్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌`2’ మూవీ కోసం క్యాన్సర్‌ ఫైనల్‌ స్టేజీలో ఉన్న ఒక కుర్ర అభిమాని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.

 Cancer Patient Last Wish To See Gabbar Singh-2-TeluguStop.com

తనకు ‘గబ్బర్‌సింగ్‌`2’ సినిమా చూడాలని ఉంది అంటూ చాలా రోజులుగా అంటూ వస్తున్నాడు.తాజాగా ఈయన విషయం సోషల్‌ మీడియా ద్వారా బయటకు వచ్చింది.

పది సంవత్సరాల ఈ బాలుడు క్యాన్సర్‌ కారణంగా త్వరలో చనిపోతాడట.తాను చనిపోయే విషయం ఆ బాలుడికి కూడా తెలుసు.

అయినా కూడా చనిపోయేలోపు ‘గబ్బర్‌సింగ్‌`2’ను చూడాలని కోరుకుంటున్నట్లుగా ఆ బాలుడు చెబుతున్నాడు.ఇంతటి అభిమానం ఏంటో అని కొందరు అంటున్నా కూడా, అభిమానానికి హద్దు ఉండదు అని అందుకే అన్నారు.

మరి ఈ అభిమాని చివరి కోరిక తీర్చేందుకు అయినా పవన్‌ తన ‘గబ్బర్‌సింగ్‌`2’ పనులను వేగవంతం చేస్తాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube