10 రోజుల్లో రెండుసార్లు గర్భవతి అయిన మహిళ .. ఇలా జరుగుతుందా ?

గర్భంలో ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉండటం కొత్త కాదు.ప్రపంచంలో ఎంతోమంది కవల పిల్లలు ఉన్నారు.

 Can Women Get Pregnant Again When She Is Already Pregnant ?-TeluguStop.com

కాని కవల పిల్లలు వేరు వేరు గర్భాల్లో పెరగరు.ఒకే గర్భం.

కాన్పులో తేడా ఉండొచ్చు, ఒకరు ముందు వెనుక అన్నట్లు.కాని ఒక గర్భం ఉండగానే మహిళ మరోసారి గర్భవతి కావచ్చ? అంటే ఒకే శరీరంలో రెండు గర్భాలు ఒకే సమయంలో పెరగటం.ఇది సాధ్యమేనా ? అవును సాధ్యమే.ఇదే వారంలో ఓ మహిళకి ఇలా జరిగింది కూడా.

దీన్నే సూపర్ ఫెటేషన్ అని అంటారు.ఇంగ్లీష్ అక్షరాల్లో చెప్పాలంటే Superfetation.

ఇది కేవలం మనుషులకే జరగదు.చేపలు, కంగారూలు, కుందేళ్ళు, పంతర్స్, ప్రైమేట్స్ లాంటి జంతువులలో కూడా జరుగుతుంది.

ఇక తాజా కేసులోకి వెళితే, కేవలం పదిరోజుల వ్యవధిలో ఓ మహిళ రెండు సార్లు గర్భం దాల్చింది.అది కూడా ఆవిడ మామూలు మహిళ కాదు.

పోల్య్సిస్టిక్ ఓవరీ సిండ్రోం కలిగన మహిళ.అంటే ఇలాంటి వారు గర్భం దాల్చలేరు.

కాని కొన్నేళ్ళుగా హార్మోన్ థెరపి తీసుకుంది ఆవిడ.ఎలాగైనా ఓ బిడ్డకు జన్మనివ్వల్సిందే అని కొన్నేళ్ళపాటు ఖర్చులు చేసింది.

ఆమె ఊచించని విధంగా ఒకసారి కాదు, రెండు సార్లు గర్భం దాల్చింది.ఇది ఎంత అరుదైన కండీషన్ అంటే, డాక్టర్లు సైతం అర్థం చేసుకోలేక, అసలు ఇలా జరిగే అవకాశం ఉంటుందా అని గూగుల్ వెతికారట.

మరి ఆవిడ రెండుసార్లు గర్భం ఎలా దాల్చింది.అది కూడా అప్పటికే గర్భవతి అయ్యుండి.

ఇదెలా సాధ్యపడుతుంది ?

సూపర్ ఫేటేషన్ అనేది ఓవమ్ ఫెర్టిలైజేషన్ వలన కలుగుతుంది.ఇలాంటి పరిస్థితిలో ఏం జరుగుతుంది అంటే ఒక అండం యుటేరస్ లో ఉండగానే మరో ఎంబ్రియో డెవెలప్ అవుతూ ఉంటుంది.

ఓవం వేరు వేరు సమయాల్లో ఫెర్టిలైజ్ అవడంతో రెండుసార్లు స్త్రీ గర్భం దాల్చుతుంది.నార్మల్ గానైతే, ఓ మహిళ గర్భం పొందగానే ఒవరీస్ నుంచి అండాలు విడుదల అవ్వవు.

కాని ఇలాంటి చాలా అరుదైన సందర్భాల్లో మాత్రం మరో అండం విడుదల అవుతుంది.అందుకే ఆ స్త్రీ 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు గర్భం దాల్చింది.ఇలా ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 కేసులు అందుబాటులో ఉన్నాయి.అంటే మెడికల్ రికార్డ్స్ ప్రకారమైతే ఇప్పటివరకు కేవలం 10 మంది స్త్రీలకు ఇలా జరిగింది.

ఇక మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత అరుదైన కండిషన్ అనేది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube