శుభకార్యాలలో నవధాన్యాలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో తెలుసా?

సాధారణంగా నవ ధాన్యాలను నవ గ్రహాలకు సంకేతంగా భావిస్తారు.తొమ్మిది గ్రహాలకు తొమ్మిది ధాన్యాలు అధీన ధాన్యాలుగా ఉన్నాయి.

 Can We Use Navadhanya For All Hindu Rituals Telugu Devotional-TeluguStop.com

సూర్యుడికి గోధుమలు … చంద్రుడికి బియ్యము.కుజ గ్రహానికి కందులు.

బుధ గ్రహానికి పెసలు.గురు గ్రహానికి సెనగలు.

శుక్ర గ్రహానికి బొబ్బర్లు.శని గ్రహానికి నువ్వులు.

రాహుగ్రహానికి మినుములు.కేతు గ్రహానికి ఉలవలు అధీన ధాన్యాలుగా ఉన్నాయి.

ఈ నవ ధాన్యాలను దైవ కార్యాలలోను శుభకార్యాలలోను తప్పనిసరిగా ఉపయోగిస్తారు.ముఖ్యంగా వివాహ సమయంలో ఈ నవధాన్యాలను మట్టి మూకుళ్లలో పోసి ఉంచుతారు.అవి బాగా మొలకలు వస్తే వారి సంసారం చాలా అన్యోన్యంగా సాగుతుందని భావిస్తారు.అంతేకాకుండా వారిపై నవగ్రహాల అనుగ్రహం ఉంటుందని విశ్వాసం.

నూతన వధూవరులిద్దరూ ఇటు నవగ్రహాలను.వాటితో అనుసంధానించబడిన ధాన్యాల అనుగ్రహాన్ని పొందడమే ఉద్దేశంగా ఈ తంతు కొనసాగుతుందని చెప్పవచ్చు.

నవధాన్యాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.ఒక్కో ధాన్యంలో ఒక్కో గుణం ఉంది.

నవ ధాన్యాలను తీసుకోవటం వలన మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి.జీవితంలో అన్ని రకాల మనస్తత్వాలను సమన్వయ పరుచుకోవాలనే ఉద్దేశాన్ని నవ ధాన్యాలు తెలుపుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube