కాపీ కొట్టొద్దు....!

కాపీ కొట్టడం అంటే ఏమిటి? అసలు దాన్ని మక్కీకి మక్కీ తయారుచేయడం.దీన్నే డూప్లికేషన్‌ అని కూడా అనొచ్చు.

 Cambodia Lodges Protest With India Over Angkor Wat Replica-TeluguStop.com

అంటే ఒక వస్తువును పోలిన మరో వస్తువును అచ్చం అలాగే రూపొందించడం.కాపీ, డూప్లికేషన్‌ ఇలాంటివి నేరాలుగా పరిగణిస్తుంటాం.

అందుకే కంపెనీలు తమ వస్తువులకు ట్రేడ్‌ మార్క్ హక్కులు తీసుకుంటాయి.ఉత్పత్తులకు పేటెంట్‌ హక్కులుంటాయి.

ఈ హక్కులను ఉల్లంఘించకూడదు.అయితే వందల, వేల సంవత్సరాల క్రితం నాటి కొన్ని కట్టడాలకు, వస్తువులకు ఏం హక్కులు ఉంటాయి.

వాటిని ఎవరైనా కాపీ చేస్తే నేరమా? అవునని అంటోంది కంబోడియా దేశం.కొన్ని విదేశాల్లో పురాతన హిందూ దేవాలయాలు ఉన్నట్లే కంబోడియాలోనూ అతి పురాతనమైన, ప్రపంచ ప్రసిద్ధ ఆలయం ఉంది.

దాని పేరు ‘అంగ్‌కోర్‌ వాట్‌’.ఇది పన్నెండో శతాబ్దం నాటికి చెందినది.

ఇదే ఆలయాన్ని పోలిన ఆలయాన్ని అంటే ప్రతిరూపాన్ని (రెప్లికా) భారత్‌లో నిర్మిస్తున్నారని, ఇది నేరమని కంబోడియా ప్రభుత్వం చెబుతోంది.పాట్నాకు చెందిన మహవీర్‌ మందిర్‌ ట్రస్టు రాముడి ఆలయాన్ని అంగ్‌కోర్‌ వాట్‌ నమూనాలు కట్టబోతున్నది.

దీని పేరు ‘విరాట్‌ రామాయణ్‌ మందిర్‌’.దీన్ని పాట్నాకు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో నిర్మించబోతున్నారు.

అంగ్‌కోర్‌ వాట్‌ నమూనాలో నిర్మితమయ్యే ఈ ఆలయం చాలా భారీగా ఉంటుంది.ట్రస్టు వెబ్‌లో కూడా దీని డిజైన్‌ పెట్టారు.

నూట అరవై ఒక్క ఎకరాల్లో ఈ ఆలయం నిర్మించబోతున్నారు.దీని నిర్మాణాన్ని కంబోడియా ప్రభుత్వం తీవ్రంగా నిరసిస్తోంది.

ఎందుకంటే అదే నమూనాలో మరో ఆలయం నిర్మితమైతే అసలు దానికి విలువ తగ్గుతుంది.కంబోడియాలోని ఆలయాన్ని ఐక్యరాజ్య సమితి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

అందుకే ఈ నమూనాలో ఆలయం వద్దని కోరుతోంది కంబోడియా ప్రభుత్వం.మరి దీనిపై మన సర్కారు ఏం చెబుతుందో…!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube