అనసూయని వ్యాంప్ అంటూ తిట్టండి అని ప్రోత్సహించాడు

అతనొక టాప్ హీరోకి పీఆర్.ఆ హీరోకి సంబంధించిన ఏ టూ జెడ్ పనులు ఈయనే చేయాలి.

 Call Anasuya A “vamp” – Top Pro Hatred Campaign-TeluguStop.com

పెద్ద నేర్పరి కాబట్టే ఆ హీరోకి ఈయన మీద నమ్మకం.అందుకే పాపులర్ అయిపోయాడు.

ఇక, తన తొందరపాటు పద్ధతుల వలన అప్పుడప్పుడు చిక్కుల్లో పడతాడు.తాజాగా, యాంకర్ అనసూయ చేతికి చిక్కాడు.

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే, గుంటూరు టాకీస్ సినిమా ఆడుతున్న రోజులవి.ఆ సినిమా చూసిన ఈ సినీ పెద్దమనిషి రష్మీని తెగ మెచ్చేసుకున్నాడు.

మరి రష్మీ మీద పొగడ్తలకి అనసూయ ఎందుకు నొచ్చుకుందో తెలియదు కాని, ఈ పీఅర్వోని ఓ మాట అనేసింది.అనసూయ మీదకి మాత్రం ఎదురుదాడి చేయలేదు ఆ పీఅర్వో.

కాని, ఎదురుదాడి చేయించాడు.

అనసూయని దారుణంగా విమర్శిస్తూ ఎవరెవరో తిట్టేసారు అప్పుడు.

అంతా స్వచ్ఛందంగా తిడుతున్నారేమో అనుకుంది పాపం అనసూయ.కాని అసలు నిజం ఇప్పుడు తెలిసింది.

ఆ పీఅర్వో అనసూయని తీవ్రంగా విమర్శించండి, “వ్యాంప్” అంటూ తిట్టండి అంటూ తన మనుషులకి కబురు పెట్టాకే, అనసూయ మీద మాటల దాడి మొదలైందట.

ఎన్ని వింతలు, విశేషాలు జరుగుతాయి చూడండి సినిమా ఇండస్ట్రీలో.

అనసూయకి ఈ విషయం మొన్నే తెలిసింది.మరి ఇప్పుడు ఆ పీఆర్వో మీద అనసూయ వ్యవహారశైలి ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరమైన విషయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube