ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి తినాలి-Calcium Rich Foods For Strong Bones 3 months

Calcium Rich Foods For Strong Bones Healthy Milk Orange Soya Beans Vitamin C Photo,Image,Pics-

మానవ శరీర నిర్మాణంలో ఎముకలది చాలా కీలక పాత్ర. ఎముకలు బలంగా ఉంటేనే మనుషి నడవటం, కూర్చోవడం, పడుకోవడం .. ఇంకా చెప్పుకుంటూపోతే అన్నిరకాల పనులు చేయగలడు. ఎముకలు బలంగా లేకపోతేనే ఒంట్లో నొప్పులు పుట్టుకొస్తాయి, కీళ్ళు నొప్పివేస్తాయి. అంతేకాదు ఆస్టియో పోరోసిస్ లాంటి పెద్ద సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి ఎముకలు బలంగా ఉండటం ముఖ్యం. అంటే కావాల్సినంత కాల్షియం శరీరానికి అందుతూ ఉండాలి. మరి కాల్షియం బాగా దొరికే ఆహారం ఏంటో చూద్దాం!

* ఆరెంజ్ లో విటమిన్ సి మాత్రమే కాదు, కాల్షియం కూడా బాగా దొరుకుతుంది. ఎంత బాగా అంటే ఒక్క ఆరెంజ్ లో సగటున 60 మిల్లిగ్రాముల కాల్షియం దొరుకుతుంది.

* వైట్ బీన్స్ లో కూడా కాల్షియం బాగా దొరుకుతుంది. సగం కప్పులో వైట్ బీన్స్ తీసుకున్నా 100 గ్రాముల కాల్షియం శరీరానికి అందుతుంది.

* బ్రొకోలిలో కూడా కాల్షియం మంచి మోతాదులో ఉంటుంది. 100 గ్రాముల బ్రొకోలిలో 47 మిల్లిగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇందులో అదనంగా ఉండే న్యూట్రింట్స్ మీ శరీరానికి ఇంకెన్నో విధాలుగా సేవలందిస్తాయి.

* సోయా బీన్స్ లో కాల్షియం చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఆశ్చర్యంగా అనిపించినా 100 గ్రాముల సోయా బీన్స్ లొ ఏకంగా 277 మిల్లిగ్రాముల కాల్షియం ఉంటుంది.

* పుదీనాలో కూడా కాల్షియం పాళ్ళు ఎక్కువ. 100 గ్రాముల పుదీనాలో 243 మిల్లిగ్రాముల కాల్షియం ఉంటుంది.

* కాల్షియం గురించి మాట్లాడినప్పుడు పాల గురించి కూడా మాట్లాడాలి కదా. 100 మిల్లీలీటర్ల పాలు తాగితే 125 మిల్లిగ్రాముల కాల్షియం పొందవచ్చు.

* ఆల్మండ్స్ లో కూడా కాల్షియం మోతాదు ఎక్కువే. 100 గ్రాములకి 264 మిల్లిగ్రాముల కాల్షియం దొరుకుతుంది.

* ఇంకా చెప్పాలంటే, నువ్వులు, ఓట్ మీల్, సాల్మన్ ఫిష్, వెల్లుల్లి, మస్టర్డ్ లీవ్స్,

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...నిద్ర గురించి మీకు తెలియని నిజాలు

About This Post..ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి తినాలి

This Post provides detail information about ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి తినాలి was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health,Telugu Health Tips.

Calcium rich foods for strong bones, Healthy Bones, Milk, Soya beans, Almonds, Orange, Vitamin C

Tagged with:Calcium rich foods for strong bones, Healthy Bones, Milk, Soya beans, Almonds, Orange, Vitamin Calmonds,Calcium rich foods for strong bones,Healthy Bones,milk,orange,soya beans,vitamin C,,