రియల్‌ మెన్‌గా ఎన్టీఆర్‌!

ఎన్టీఆర్‌ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నాడు.ఇప్పటి వరకు సినిమాలతోనే బిజీ బిజీగా గడిపిన ఎన్టీఆర్‌ ఇక తోటి హీరోల మాదిరిగా వ్యాపార రంగంలోకి ఎంటర్‌ అవ్వబోతున్నాడు.

 Businessman Skills Of  Young Tiger Ntr-TeluguStop.com

తోటి హీరోలు నిర్మాతలుగా, పలు వ్యాపార రంగాల్లో దూసుకు పోతున్న ఈ సమయంలో ఎన్టీఆర్‌ సైతం వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు.అందులో భాగంగా ఈయన మొదట రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సిటీలోని ప్రముఖ భవన నిర్మాణ కంపెనీలో ఎన్టీఆర్‌ భాగస్వామ్యం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఎన్టీఆర్‌ ఆ రంగంలోక అడుగు పెట్టడం జరిగిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఎన్టీఆర్‌ ఇప్పటి వరకు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 15 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.అతి ఖరీదైన అపార్ట్‌మెంట్స్‌లో లగ్జరీ ఫ్లాట్‌లను ఈయన కొన్నాడు.

తనకున్న క్రేజ్‌ను వ్యాపారంలో వినియోగించుకునేందుకు ఎన్టీఆర్‌ ప్రయత్నం చేస్తున్నాడు.యంగ్‌టైగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ ఇకపై రియల్‌ మెన్‌గా పిలిపించుకుంటాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube