బస్ స్టాప్ పాపకి మళ్ళీ అదిరిపోయే ఆఫర్

మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో, బస్ స్టాప్ సినిమాలలో ఒక హీరోయిన్ గా నటించిన అమ్మాయి రక్షిత అంటే పెద్దగా ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు.వరుణ్ సందేశ్ తో ప్రేమంతా పని చేసే నారాయణ అనే సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా నటించింది.

 Bus Stop Fame Rakshita Got Interesting Offer, Tollywood, Telugu Cinema, Kollywoo-TeluguStop.com

అయితే ఆమె చేసిన సినిమాలతో వచ్చిన గుర్తింపు అయితే పెద్దగా ఏమీ లేదు.ఇక్కడ సరైన అవకాశాలు, గుర్తింపు రాకపోవడం రక్షిత కోలీవుడ్ లో అడుగుపెట్టి ఆనందిగా పేరు మార్చుకొని అక్కడ వరుస అవకాశాలు సొంతం చేసుకొని సినిమాలు చేసింది.

అక్కడ హీరోయిన్ గా ఏకంగా 17 సినిమాలలో నటించింది.ఈ సినిమాలో ఆమెకి నటిగా మంచి గుర్తింపు వచ్చింది.

కోలీవుడ్ లో హీరోయిన్ ఆనంది అంటే పాపులర్ నేమ్ అయిపోయింది.అయితే 2013లో ఆమె చివరి తెలుగు సినిమా చేసింది.

మళ్ళీ ఏడేళ్ళ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జాంబిరెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఈ అమ్మడు ఆనంది పేరుతోనే అడుగుపెట్టింది.

Telugu Bus Rakshita, Karuna Kumar, Kollywood, Sridevi Soda, Sudheer Babu, Telugu

ఇందులో ఓ పవర్ ఫుల్ రోల్ ని ఆమె పోషిస్తుంది.ఇప్పుడు ఈ సినిమా పూర్తయ్యే సరికి మరో క్రేజీ ఆఫర్ ని ఈ భామ సొంతం చేసుకుంది.సుదీర్ బాబు హీరోగా పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా తెరకెక్కబోతుంది.

ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర ఆనందిని వరించింది.ఈ సినిమా కోసం అచ్చతెలుగు అమ్మాయిని తీసుకోవాలని అనుకున్న కరుణ కుమార్ కి ఆనంది రూపంలో తన శ్రీదేవి దొరికింది.

దీంతో ఆమెని హీరోయిన్ గా ఫైనల్ చేశాడు.ఈ రెండు సినిమాలు హిట్ అయితే మళ్ళీ మాతృభాషలో ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకొని తన ఇమేజ్ పెంచుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube